పుట:భాస్కరరామాయణము.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కుం దలఁప నీనిశాచరు, లందఱు నని పల్కి మఱియః నందఱతోడన్.

92


క.

నరులకు వానరులకు సాగర మెట్లొకొ దాఁటవచ్చుఁ గార్యస్థితు
వెరవులొ కా దనఁగా రా, దరుదుగ నొకక్రోతి గాదె యంతలు సేసెన్.

93


క.

కాన విచారింపుఁడు మన, మేరీతిఁ జరింపవలయు నెన్నివిధముల
జానకి నటఁ బుచ్చక య, మ్మానవుల జయించుతెఱఁగు మంత్రప్రౌఢిన్.

94


వ.

అని పలికి విజృంభించి.

95


మ.

నరులే నన్ను జయించువారు మొదలన్ నాలావు మీ రాసురా
సురయుద్ధంబులఁ జూడరే రఘుకులాస్తోకప్రతాపాగ్ని నా
శరవృష్టిం జెడ నాఱిపోవుట మదిన్ సందేహమే చూడుఁడీ
యరుదుం జూపెద నెల్లి నేఁడ ధనురభ్రాడంబరం బొప్పగన్.

96


వ.

అనిన విని కుంభకర్ణుం డి ట్లనియె.

97


శా.

సీతం దెచ్చితి కార్యవేది వయి నీచే మున్ను సర్వంబు ని
ర్ణీతం బైనది యింక నేల చెపుమా నీ కేవిచారంబు నీ
నీతిజ్ఞుల్ మును గాఁగ రాఘవధనుర్నిర్ముక్తనిర్ఘాతసం
ఘాతక్రూరశిలీముఖాగ్నిఁ బడి మగ్గం బోదు గా కే మనన్.

98


తే.

నీతిపథమునఁ గార్యంబు నిశ్చయించి, తగువు దప్పక సేయునతండు మీఁద
నిడుమ పొందఁడు ధర్మంబు విడిచి చొప్పు, దప్పి కావించునతఁడు సంతాప మొందు.

99


క.

మొదలు విచారింపక చే, యుదు రది తుది నొప్పకున్న ను క్కడఁగి ముడుం
గుదురు విను తులువ లప్పను, లొదవక చెడు [1]బూడ్డ నిడిన హుతములకరణిన్.

100


ఆ.

ఎఱుక లేక చపలుఁ 6డేవంకఁ దిగిచిన, నల్పమతులు వాని ననుసరింతు
రొక్కకొంగ పాఱ క నున్నకొంగలు గూడ, నెగసి పాఱు చునికి తగవు గాదె.

101


వ.

అదియునుం గాక.

102


తే.

[2](ఆదిమధ్యాంతరహితుఁ డై నట్టివిష్ణుఁ, డనురకులవధార్థం బిట్టు లవతరించె
రవికులాంబుధిసోముఁ డై రామచంద్రుఁ, డురుబలుఁడు గాని సామాన్యతనరుఁడు గాఁడు.

103


క.

ఈవిధమున మును నారదు, చే వింటిం బంక్తికంఠ సీతను మరలన్
భూవిభునకు నర్పింపు శు, భావహ మయ్యెడిని మనకు నమరారాతీ.

104


వ.

అనిన విని పది మొగంబులు జేవుఱింప నున్నదశగ్రీవుకోపరసభావం బెఱింగి
మఱి యొక్కింతసేవునకుఁ గుంభకర్ణుం డి ట్లనియె).

105


శా.

ఇం కీమాటలకుం బ్రయోజనము లే దీజీవనం బేటికిన్
లంకాదాహము విన్ననాయలుక యెన్నం డాఱు నట్లుండె నా

  1. బూది నిడిన
  2. ఈకుండలీకరణములోనిది కొన్నిప్రతులం గానిపింపదు.