పుట:భాస్కరరామాయణము.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బును గంభీరాతిఘోరాద్భుతరవబధిరీభూతరోదోంతరంబున్
ఘననక్రగ్రాహదర్వీకరమకరమహాకచ్ఛపానేకమీనం
బును జూడారంగరంగద్భువనపవనభుగ్భూనభోంతర్ధి వార్ధిన్.

29


కని తదీయం బైనమహామహిమంబు గొనియాడుచుం జేర నరిగి నానాతరులతా
కుంజపుంజంబులం బొల్చు వేలావనంబున విడిసి రప్పుడు.

30


సీ.

పృథులహాసంబులు పెన్నురువులభంగి, వఱల వాలములు ప్రవాళలతల
కైవడిఁ జెలువార ఘనబాహుశాఖలు, బహుళవీచీపరంపరలకరణి
విలసిల్ల నుద్భటవీరసంచారముల్, కుటిలతరగ్రాహకఘోరగతుల
చాడ్పున నొప్పారు సందడి [1]పలుకుల, యులి వఖండధ్వనియోజ నిగుడ
వివిధవాహినీసంగతి వెలయ నినజు, నాజ్ఞ చెలియలికట్ట యై యడర రామ
చంద్రునుదయ ముదంచితోత్సవముఁ జేయ, నొప్పెఁ [2]గపిబలోదధి వార్ధి కుద్ది యగుచు.

31


వ.

తదనంతరంబ.

32


ఆ.

జానకీవియోగసాగరమగ్నుఁ డై, రామచంద్రుఁ డుండఁగా మనోజ్ఞ
భంగి నింకఁ దగునె పద్మినీభోగ మ, న్నట్లు గ్రుంకె నర్కుఁ డపరజలధి.

33


తే.

ఇనతురంగరింఖాహతి నెసఁగునస్త, శైలధాతుశిలోద్ధూతధూళిపటల
మనఁగ నపరదిశాభాగమునకు వింత, చెలువు సేయుచు నెఱసంజపొలుపు మిగిలె.

34


క.

భూపాలకపరమేశ్వరు, కోపానలకీల లంటికొని కమలినలం
కాపతికీర్తియొకో యని, రూపింపఁగఁ [3]జీకువాలు రోదసి నిండెన్.

35


క.

వనచరనాయకసంఖ్యకు, వనజభవుఁడు బొట్టు లిడుచు వచ్చె నొకో నాఁ
గనదురుదీప్తుల గగనం, బున నొక్కఁడొకండ తోఁచెఁ బొరిఁ దారకముల్.

36


శా.

గంగాతుంగతరంగపాండురమయూఖశ్రేణినిశ్రేణికా
భంగిన్ నింగికి నబ్ధికిన్ నడుమఁ బైపై నొప్పఁ బ్రాగ్భూమిభృ
చ్ఛృంగాగ్రంబు నలంకరించె సితరోచిర్మండలం బభ్రమా
తంగోదంచితకుందకందుకముచందం బొంది రమ్యాకృతిన్.

37


క.

వెడవిలుతుకీర్తిజాలము, వడువునఁ జంద్రాతపంబు వాలుటయును ము
న్నుడు కెత్తినడెందముతో, వడఁకాడెడుధైర్య మెడల వగలఁ బొగులుచున్.

38


వ.

కౌసల్యానందనుండు సుమిత్రానందనున కి ట్లనియె.

39


ఉ.

రక్కసుచేతఁ బట్టువడి రాజనిభానన యేఁగునప్పు డే
దిక్కున నానలేమి నలుదిక్కులుఁ జూచుచు భీతి నాథ నీ
వెక్కడఁ జిక్కి తంచు నెలుఁగెత్తి పొరింబొరి నన్నుఁ జీరుచుం

  1. పలుకుల, య్యుదధిచండధ్వని
  2. గపిబలం బుదధికి సుద్ది యగుచు
  3. జీకువాయ