పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/789

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

299


వారి యుద్యోగియే యగుచున్నాడు. హిందూదేశ రాజ్యాంగ చట్టమునుబట్టి ఈ రాజ్యాంగమంత్రికి హిందూదేశ ప్రభుత్వవర్గము పైన పెత్తనము, పరిపాలనాధికారములు,మాత్రమేగాక పరిపాలనావిధానమును నడపుటకు రాజాజ్ఞలనిచ్చుటకు నధికారములు కూడ కలవు. ఈమంత్రికి ఇండియాకవున్సిలు అనునొక కార్యాలోచనసభకలదు. సాధారణముగ నితడన్ని పనులు నాసభవారితో ఆలోచించి చేయునుగాని రహస్య విషయములం దట్లాలోచింపడు. ఇంగ్లీషు “కాబినెట్టు” మంత్రిమండలియొక్క ఆచారధర్మములనుబట్టి సమస్తకార్యములును ప్రధానమంత్రియు, తక్కిన ముఖ్యమంత్రులును గలిసి బ్రిటీషు దీవుల ప్రభుత్వమును, సామ్రాజ్య ప్రభుత్వమును నడుపుదురు ఆ రాజ్యంగవిధానమున, ఏ రాజకీయపక్షమువారి ప్రతినిధులు పార్లమెంటులో నధికసంఖ్యాకులైయుందురో ఆరాజకీయ సిద్దాంతముల ప్రకారము ప్రభుత్వముచేయు మంత్రి మండలియే పరిపాలన మందుండును గనుక తక్కిన రాజకీయములందువలెనే హిందూదేశ ప్రభుత్వపద్దతులుగూడ ఆయా కాలములందు ప్రభుత్వము సేయు రాజకీయ పక్షమువారి యభిప్రాయములకు లోనై యుండునని చెప్పవలసిన పనిలేదు.

వైస్రాయి అధికారములు

హిందూదేశ రాజ్యాంగమంతి) యధికారములకు, ఆజ్ఞలకులోబడి భరతఖండమునందలి పరిపాలనాధికారములు అనగా ప్రభుత్వముయొక్క వ్యవహారిక, సైనిక కార్యనిర్వహణాధికారమెల్ల కార్యాలోచన సంఘ సభాయుతుడగు గవ