పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/788

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

298

భారతదేశమున


కాదు. ఈ రాజ్యాంగమువలన భారతదేశ నిరంకుశ పరిపాలానా విధానములో నావంతయైన మార్చుకలుగలేదు. బ్రిటీషు సామ్రాజ్య లాభవిధానమునందు కొరంతకలుగలేదు. ప్రభుత్వము నాశ్రయించు జమీందారులు మితవాదులు ధనవంతులు శాసనసభలందుజేరి వారి మెప్పు బడయ ప్రయత్నింపసాగిరి. ఇది త్వరలోనే విదితమయ్యెను. 1910 లో నీ శాసనసభవారు దేశప్రజల అభిప్రాయ ప్రకటనను అణచివేయగల తీవ్రనిబంధనలతో ప్రెస్సుచట్టమును చేయుటకు బుద్ధిపూర్వకముగా తోడ్పడిరి. దేశములోని రాజకీయ మితవాదులను సంతృప్తిపరుప జూచుకార్యము లింకను కొన్ని చేయబడెను. 1912 లో జరిగిన ఢిల్లీదర్బారులో వంగరాష్ట్ర విభజన రద్దు చేయబడెను.

నాలుగవ అనుబంధము:

మాంటేగు రాజ్యాంగసంస్కరణము

1919 సం|| హిందూదేశ రాజ్యాంగచట్టము ప్రకారము భరతఖండముయొక్క పరిపాలనమునకు ఇంగ్లాండులోని ప్రధాన ప్రభుత్వాధికారి బ్రిటీషు నృపాలుని మంత్రిమండలిలో నొకడగు హిందూదేశ రాజ్యాంగమంత్రి ( Secretary of State for India). ఈతడు పార్లమెంటువారికి బాధ్యతకల కార్యనిర్వాహకమంత్రి యగుటవలనను, బ్రిటీషు రాజ్యాంగవిధానమును బట్టి సార్వభౌమత్వాధికారములును ప్రభుతయు పార్లమెంటునందే నెలకొనియుండుటవలన నీమంత్రి నిజముగ పార్లమెంటు