పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/717

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

227


IV

సైనిక ఉద్యోగులు

చట్టముయొక్క 10వ భాగము, ఇండియా ప్రభుత్వోద్యోగములను గూర్చినది. దీనిలో ఒకటవ ప్రకరణము దేశరక్షణకు సంబంధించిన ఉద్యోగములను గూర్చినది. 232వ శెక్షనునుబట్టి సర్వసేనాని (కమాండరు ఇన్ చీఫ్) యొక్క విపరీతపుజీతము అలవెన్సులు ఎప్పటివలెనే ఇండియారివిన్యూ ఆదాయమునుండియే ఒసగబడును. నిజముగా ఈ దేశములోని సైన్యము సామ్రాజ్యసైన్యమే యని కొంతకాలముక్రిందట నింగ్లీషు ప్రధానిగానుండిన రాంశే మెక్డానల్డుగారే చెప్పియున్నారు. అయినప్పటికిని దీని సర్వసేనానిఖర్పులు మనపైననే వేయబడినవి. 233 వ శెక్షనుప్రకారము చక్రవర్తి తన యిష్టానుసారముగ సైనికోద్యోగులను నియమింపవచ్చును. 235 వ శెక్షనుప్రకారము ఇండియా సైన్యములలో నెవ్వరికైనను చక్రవర్తి 'కమీషను' పదవులను ఇవ్వవచ్చును. ఈ సైన్యముల కొలువునుగూర్చిన షరతులను రాజ్యాంగ కార్యదర్శియే నిర్ణయించును. 236 వ శెక్షనునుబట్టి ఈ సైన్యములోని వారి కెల్లరికిని ఇండియా గవర్నమెంటువారి ఉత్తర్వులపైన రాజ్యాంగకార్యదర్శికి అపీలు చేసుకొనుహక్కు 237 వ సెక్షను వల్ల ఇవ్వబడినది. ఈ కొలువులో నుండినవారి యొక్కయు, ఉన్నవారియొక్కయు జీతబత్తెములు అలవెన్సులు, ఫెడరేషనుయొక్కయు రివిన్యూపైన బద్దతచేయబడినవి. సైన్యమునకు సంబంధించిన యేవ్యయములను గాని, రివిన్యూపైన ఆధార