పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/624

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

134

భారతదేశమున

మొత్తము విద్యార్థులసంఖ్య 26000. ప్రభుత్వము చేసిన మొత్తము ఖర్చు 990 వేల రూపాయిలు.

1856-57 లో విద్యకొరకు ప్రభుత్వము చేసిన ఖర్చు రు 3940000 లు. విద్యకొరకైన మొత్తము ఎన్నిరూపాయిలుగా లెక్కలలో జూపినను, దానిలో 4వ వంతు విద్యార్థుల స్కూలు జీతములవల్లను 5 వ వంతు ప్రజల ధర్మములవల్లను వచ్చినసొమ్ము గాన చాలా తక్కువసొమ్ము మాత్రమే అసలు ఖర్చు. 1856-57 నాటికి 13 కాలేజీలుండెను. అన్ని పాఠశాలలందు చదువువిద్యార్థులసంఖ్య 4 లక్షలు. 1906-07 లో 179 కాలేజీలు అన్నివిధములైన పాఠశాలలందు కలిసి 57 లక్షల విద్యార్థులు నుండిరి. 1871 నాటిజనాభాలెక్క ప్రకారము దేశములో చదువువచ్చిన వారిసంఖ్య నూటికి, 5 మంది. 1906-07 లో 5.3 మంది.

vi 1871 వరకు ఇంగ్లాండు పౌను నవరసుకు 10 రూపాయిలు విలువ; తరువాత 15 రూపాయిలు విలువ; అనగా మన మాదేశమునుండికొనిన వస్తువు ఖరీదులక్రింద ఆదేశపుఉద్యోగులు జీతముక్రిందను ఋణములపైన వడ్డీలక్రిందను మనమిచ్చుకొనవలసి యుండిన పౌనుల (నవరసు) ఒక్కొక్కదానికి పూర్వముకన్న 5 రూపాయిలు అధికముగా నిచ్చుకొనునట్లు నిర్ణయింపబడెను.

vii 1857 లో 300 మైళ్ల రైల్వే. 1909లో 30983 మైళ్లు. ఇది నిర్మించినందు కైనఖర్చు 450 కోట్ల రూపాయిలు అయితేవీనిపైన ప్రతిసాలునవచ్చిన నష్టము ఈ క్రిందివిధముగానుండెను..