పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/419

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాంటేగూ సంస్కరణల నాటకము

395

అవసరము వచ్చినప్పుడెల్ల గవర్నరు జనరలు తన పరిపాలకవర్గమునకే సాహాయ్యము చేయుచు, తన విశేషాధికారములు, అవసర శాసన నిర్మాణాధికారములు ప్రయోగించుచు ప్రజా ప్రతినిధుల యభిప్రాయములను తృణీకరించు చుండును.

II

రాష్ట్రీయ పరిపాలకవర్గము

ఈ మాంటేగూ రాజ్యాంగమున రాష్ట్రీయ పరిపాలనమందు గవర్నరు యొక్కయు, పరిపాలకవర్గముయొక్కయు అధికారములు కేంద్రపరిపాలనము నందలి గవర్నరు జనరలు పరిపాలకవర్గమువారి యధికారములవలెనే యున్నందున నిచ్చటను ప్రజాప్రతినిధుల యభిప్రాయములు తృణీకరింపబడి, శాసనసభలు నిరుపయోగములై అధికారవర్గము నిరంకుశముగనుండెను. పోలీసు చర్యలు మున్నగు కొన్ని విషయములందు శాసనసభవారు చేసిన అసమ్మతి తీర్మానము లెంత నిరుపయోగములైనవో సత్యాగ్రహోద్యమ చరిత్ర నెఱిగిన వారెల్లరకు దెలియును. ఏవిషయమునను మన రాష్ట్రీయ శాసనసభలు ప్రజల కుపకరింపజాలకుండెను. తుదకుభూమిశిస్తు హెచ్చించు విషయమున గూడ వీరి తీర్మానము తృణీకరింప బడినది.

కొన్ని విషయములు మంత్రులవశము చేయబడి వాని పరిపాలనకు సంబంధించినంతవరకు వారు శాసనసభలకే బాధ్యులుగ నుందురను నిబంధనలు రాజ్యాంగశాససమున