పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

394

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


క్షణ విధానము ననుసరించి అన్ని దిగుమతులపైన నొకేవిధమగు హెచ్చుపన్ను విధింపదలచిరి. అంతట పరిపాలక వర్గమువారు, తమప్రణాళికయం దేమార్పును చేసినను తామంగీకరింపమని ముందుగనే స్పష్టముగ జెప్పివైచిరి! భారతదేశ అసెంబ్లీసభ కార్థిక స్వాతంత్ర్యము లేకపోయినను సామ్రాజ్య లాభవిధానమునుగూర్చిన పద్దతులు శాసనసభల యంగీకారము లేకుండగ చేయబడరాదను ఆర్ధిక స్వాతంత్ర్యధర్మ మర్యాద (Fiscal autonomy convention) భారత దేశమునకుగూడ వర్తించునని బ్రిటీషుమంత్రి పలికియుండియు నేడాధర్మము నిట్లు తృణీకరించిరి. అంతట నిట్టి యన్యాయములు జరుగు రాజ్యాంగ విధానమున తాము పాల్గొనమని మాళవ్యా పండితుడు మున్నగు జాతీయ నాయకు లెల్లరు సభనుండి వెడలిపోయిరి.

ప్రజలకును, పరిపాలకవర్గమునకును ప్రతి విషయమునను వైరుధ్యభావమే కలుగుచుండుట కేంద్రశాసనసభవారికిని పరిపాలక వర్గమునకును జరిగిన రాజ్యాంగ వివాదములందు స్పష్టముగా విదితమయ్యెను. నిరంకుశ పరిపాలకవర్గము తన యభిమతమును నెరవేర్చుకొనుట కవలంబించు వివిధ పద్దతుల విషయమున నిష్పక్షపాతబుద్దితో న్యాయ మొనరింపవలసిన అసెంబ్లీ సభాధ్యక్షుడు సైతము ప్రతివిషయమునను తమపక్షాభిమానిగ ప్రవర్తింపవలయుననియే పరిపాలక వర్గమువారు కోరుచుండుటయు, అట్లు చేయని యధ్యక్షునికిగల బాధలను శ్రీయుత విఠలుబాయి పటేలుగారు తమపదవికి రాజీనామా నిచ్చునప్పుడు బయల్పరచి యున్నారు.