పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శిస్తులనిర్ణయము - వసూలు

247


నెంటు సెటిల్మెంటు లేక శాశ్వతఫైసలా అనబడు జమిందారీ పద్ధతి; మద్రాసులోని రైత్వారీపద్ధతి. మొదటిదానియందు జమీందారులే ప్రభుత్వమునకు కొంత శాశ్వతశిస్తుచెల్లించుచు రైతులనుండి శిస్తులు వసూలుచేసికొందురు. రెండవ దానిలో ప్రభుత్వముతరఫున కలెక్టరును తహశీల్ దారుమొదలగురివిన్యూ అధికారులే శిస్తునిర్ణయముచేసి రైతులవలన వసూలు చేయుదురు. ఈ రెండుపద్ధతులవలనను గూడ, పూర్వమునాటి న్యాయమైన పద్ధతిపోయినది. పూర్వమునుండి భారతదేశప్రజల క్షేమలాభములకు తోడ్పడు గ్రామప్రజాపరిపాలన సంస్థలగు పంచాయతీలే న్యాయముగా శిస్తుల నిర్ణయమును వసూలును చేయుచు గ్రామస్థులకు బాధలేకుండా వ్యవహరించుచుండెను. ఇంగ్లీషు దొరతనము స్థాపించిన క్రొత్తపద్ధతులలో శిస్తు వసూలు చేయుటలో జమిందారుడుగాని కలెక్టరుగాని రైతులవలన తాను రాబట్టగలంత సొమ్ము పిండుటకే ప్రయత్నించును. గ్రామసంఘములిందు కాటంకముగనుండును గనుక ఆంగ్లేయులు వాని అధికారములను తీసివేసి వానిని నాశనముచేసిరి,

పండిన పంటనుబట్టి పన్నువిధించు పద్దతియే పూర్వమునుండియు అమలు జరుగుచుండెను. రాజును సేద్యగాడును కలిసి పండిన పంటను సమానముగా పంచుకొనుచుండిరి. రాజుకివ్వబడిన భాగములో పదవవంతు జమీందారుకు పోవుచుండెను. సాగుబడి, భూమిపన్ను, మున్నగు లెక్కలన్నియు గ్రామకరణము వ్రాయును. వీరికి రైతులే జీతము లిచ్చు చుండిరి. లేదా వీ రీ పని చేసినందుకు వీరి కీనాము లుండెను.