పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

246

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


చరాస్తి జప్తు, భూములు అమ్మించు అధికారము , పూర్వమునాటి చింతబరికెల పద్ధతికి తీసికట్టుగా లేకుండెను. బ్రిటిషు క్రిమినలు ధర్మము శాంతిభద్రతలను స్థాపించినదని చెప్పబడినను, 1830 సంవత్సరమువరకు దారిదోపిడిగాండ్రు, హంతకులు (థగ్గులు) విజృంభించుచునే యుండిరి. జమీందారులనేకు లీ దుర్మార్గులతో సంబంధము కలిగియుండిరి. ఆంగ్లేయులు మతాచారములతో జోక్యము కలిగించుకోమని చెప్పినందున గ్రామనౌకరులు, పాలేళ్ళు, వర్ణాశ్రమ ధర్మముల కులాచారములందు అజ్ఞానమున మునిగి వెట్టిచాకిరి బానిసత్వమున, దారిద్ర్యమున, బడియుండిరి. తుదకు రోడ్లు బావులుకూడా అందరు సమానముగా సుపయోగించుకొను భాగ్యము లేక పోయెను. అస్పృశ్యతాపిశాచము బలవంతముగానేయుండెను.

1820 మొదలు భారతదేశ వర్తకవాటములో మార్పు కలిగెను. అందువలన పారిశ్రామికుల వృత్తులుకూడా క్షీణించిపోయి దారిద్ర్యము హెచ్చెను.[1]

II

భూమి శిస్తుల చరిత్ర.

భారతదేశమున బ్రిటిషు వా రవలంబించిన భూమిపన్నులపద్దతియే మనదేశదారిద్ర్యమునకు మూలకారణమైనది. ఆంగ్లేయులు భూమిశిస్తుల వసూలులో అవలంబించిన పద్ధతులు రెండు. వంగరాష్ట్రమునందు కారన్‌వాలిస్ చేసిన పర్మ

  1. Rise and Fulfilment of British Rule in India. -Edward Thompson and G. T. Garratt.