పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు వర్తకసంఘము

143


1689 లో నింగ్లాండులోని వర్తకసంఘ కార్యనిర్వాహకులు తమవారి కిట్లువ్రాసిరి. “మనవర్తక మభివృద్ధిచెందుట మాత్రమే గాక భూమిశిస్తులుగూడ అభివృద్ధి జెందవలెను. మనవర్తక మే కారణమువల్లనైన పోయినను మన శిస్తులపైన మన మాధార పడవలసి యుండును. అది లేనిచో మనకు భరతఖండమున గౌరవముండదు”. వర్తక సంఘమువారి సేవకు లీ సలహాను జాగ్రత్తగా పాటించిరి. అప్పటినుండి వర్తకమును రాజ్యలాభమునకు మార్గముగ, సాధనముగ, నుపయోగించిరి. బంగాళమున పరాజితులైనను వారీ నీతినిగ్రహించిరి. ఢిల్లీచక్రవర్తికి మాత్రము దూరదృష్టి లేకపోయెను. 1699లో ఆంగ్లవర్తక సంఘమువారు చక్రవర్తిగారిని వేడుకొని మఱికొన్ని వర్తకస్థానముల నేర్పరచికొని కోటలను గట్టుకొనుటకు ఉత్తరువుపొందిరి. ఆంగ్ల వర్తకసంఘమువారు తమ కార్యక్రమమును మెల్లగ సాగించిరి. 16 వ శతాబ్దాంతమున నీ సంఘమువారు హుగ్లీనదీ ముఖమున చుట్టానాట్టి, కలకత్తా, గోవిందపురము లను గ్రామములను పన్ను చెల్లించు పద్ధతిని బంగాళాదేశపు సుబేదారుడగు అజీంషావలన జాగీరులుగ గైకొనిరి. ఔరంగజేబు మనుమనికిగూడ నజరానాలిచ్చి దీని కంగీకరింపజేసిరి. అంతట చక్రవర్తి యంగీకారమును బడసియో, బడయకుండగనో ఒక కోటనుగట్టి తమదేశపు రాజగు విలియము పేరిడిరి. - మొగలుచక్రవర్తి యీ చిన్న వర్తకసంఘము వా రిచ్చట నేమిచేయుచుండిరో గమనింపవలసిన యావశ్యక మేమి?

సాలుకు పదివేలరూపాయలు రుసుము చెల్లించు పద్ధతిని