పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

పద్మపురాణము


క.

పంకజనాభుని గుణములు
సంకీర్తన సేయునట్టి సత్పురుషులు ని
ష్పంకమతు లగుట వారల
వంకకు మఱచియును బోవవలవదు సుండీ!

108


ఉ.

కావున వైష్ణవోత్తములఁ గన్గొనునంతఁ దొలంగుఁ డెమ్మెయిన్
వావిరి నాదుసన్నిధికి వారలు రాఁ దగ రచ్యుతైకనా
మావళి యాత్మలం దలఁచునట్టి మహాత్ముల శంఖచక్ర[1]చి
హ్నావృతులైన యట్టి సుగుణాఢ్యుల నాదెస దేకుఁ డెన్నఁడున్.

109


వ.

దుష్టచరిత్రు లైనను విష్ణుసమారాధనంబు సేయువారలు పరిహర
ణీయులు దత్సంగులు నట్ల కావున వైష్ణవులదిక్కు పోవలదని
యముండు తన దూతలకెల్ల నెఱింగించె నట్లు గావున.

110


క.

హరిభక్తి లేనివారల
కరయఁగ నరకాబ్ధి దాఁట నన్యోపాయం
బిరవందలేదు లేదని
పరఁగఁ బురాణములు చాటుఁ బరమపవిత్రా !

111


ఆ.

విష్ణుభక్తిలేని విప్రునిఁ జండాలుఁ
జూచినట్టు లెపుడుఁ జూడవలయు
వర్ణబాహ్యుఁడైన వైష్ణవుం డగునేని
పరఁగ వాఁడు లోకపావనుండు.

112


సీ.

కులములో నొక్కఁడు గోవిందు నర్చింపఁ
       దత్పూర్వు లమరేంద్రధాము లరయ
వైష్ణవదాసులు వైష్ణవాశనము భు
       జించినవార లచ్చెరువుగాఁగ
సురలోకనిలయులు సుమ్ము వైష్ణవులిండ్ల
       నశనంబు లేదేని యచటి జలము
ద్రావిననైన నాతఁడు పుణ్యుఁ డెల్లడ
       నారాయణా యను నామజపము

  1. చిహ్నాన్వితు (ము), చిహ్నవ్రతు (హై)