పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

పద్మపురాణము


తే.

నతఁడు చూడంగ నొల్లఁ డయ్యమునిపురము
తీర్థసేవ గావించి వర్తించు నతఁడు
[1]కడఁగి లోభంబునను బ్రతిగ్రహము గొనిన
యతని తీర్థంబు నిష్ఫల మనిరి మునులు.

99


క.

ఒకమాటు గంగనాడిన
యకుటిలమతి బ్రహ్మహంతయైనను బుణ్యా
త్మకుఁడై కాలుని పట్టణ
మొకమాటును జూడ కొందు నురుతరముక్తిన్.

100


సీ.

వ్రతదానజపములు క్రతువులు పావన
        ధర్మంబులును బుణ్యకర్మములును
గంగాజలాభిషేకమునకు సరిగావు;
        గంగ కేతీర్థము ల్గావు సాటి;
పావనహరిపదప్రభవమై హరుమౌళిఁ
        గర మొప్పుచున్న గంగాజలంబు
నందుఁ గతస్నానుఁ డగు పుణ్యపురుషుండు
       పాతకసంఘంబుఁ బాయు టరుదె?


ఆ.

నరుఁడు నూఱుయోజనములనుండియు వేడ్క
గంగ గంగ యనుచుఁ గరము భక్తిఁ
దలఁచెనేని దురితతతిఁ బాసి విష్ణులో
కమును బొందు నరకగామి గాక.

101


ఆ.

మతిఁ బ్రతిగ్రహక్షమత్వంబు గలిగియు
[2]ధారగొనిన యట్టి ధర్మపరుఁడు
దివిఁ జరించు నెపుడు దేదీప్యమానుఁడై
తారాకాభమూర్తిఁ దాల్చి యతఁడు.

102
  1. కణక లోభంబుమై (హై-తి)
  2. ధారగొనిన యట్టి (ము)