పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

పద్మపురాణము


వ.

అ ట్లగుటం జేసి తులసీరోపణంబు చేసినవారు తద్బీజపత్రంబు
లెన్ని గల్గు నన్ని సహస్రవర్షంబులు విష్ణులోకంబునం బొందుదురు
తద్గంధాఘ్రాణంబున నరులు [1]గరుడారూఢులై పరమపదప్రాప్తు
లగుదురు. నర్మదాదర్శనంబును గంగాస్నానంబును దులసీ
[2]స్పర్శనంబునకు సమంబు రాదు. ప్రతిద్వాదశియందునుఁ
బ్రహ్మాదిదేవతలు చనుదెంచి తులసిపూజ సేయుదురు గావునఁ
దద్దళంబుల [3]హరి నర్చించువారలకుఁ బద్మకాంచనపుష్ప
మౌక్తికపూజాదానఫలంబులు సిద్దించుఁ. దులసీరోపణ పాలన
సేవన దర్శన స్పర్శనంబులఁ జేసిన నరులకు వాఙ్మనఃకాయసంచిత
పాపంబులు వొలియు. సకలదానంబులు తులసీరోపణంబునకు
షోడశాంశంబు దొరయవు. చూతసహస్రరోపణంబును అశ్వత్థశత
స్థాపనంబును నొక్కతులసీరోపణసదృశంబు పుష్కరాదితీర్థంబు
లును గంగాదిమహానదులును వాసుదేవాదిదేవతలును దులసి
యందు వసియింతురు గావునఁ [4]దత్పత్రంబుల విష్ణుపూజ సేసిన
నరులు లక్షయుగంబులు తల్లోకంబున విహరించుచుందురు.

76


క.

తులసీ[5]దళములచేతం
బొలుపుగ హరిహరులఁ భక్తిఁ బూజించినపు
ణ్యులు జననీగర్భగృహం
బులు దూఱక నిత్యముక్తిఁ బొందుదు రెలమిన్.

77


క.

శివపూజ సేయువారును
శివునందలి వేడ్క గల్గు శివభక్తులు నా
శివలోకంబున నుండుదు
రవిరళముగ శివునిఁ గొల్చి యాకల్పంబున్.

78
  1. గరుడారూఢులై శంఖచక్రపీతాంబరభూషణులై (హై)
  2. స్పర్శంబును సమంబ (ము)
  3. హరిహరుల (ము)
  4. తత్పత్రత్రయంబుల (ము)
  5. మంజరిచేతం (మ-తి-హై)