పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ద్వితీయాశ్వాసము

57


తే.

భువిఁ బ్రతిష్ఠలు చేసినపుణ్యుఁ డెపుడు
నరక[1]గోళంబుఁ జూడక నాక మొందు
మూలఫలపుష్పపత్రాదు లోలి నిచ్చు
తరువు లెల్లప్పుడును బుణ్యతమము లగుట.

70


ఆ.

దట్టమైన నీడఁ దనరి మార్గముక్రేవఁ
బొదలు తరువు లిచ్చు పుణ్యమునకు
నశ్వమేధశతములైనను [2]సమముగా
వనిరి ధర్మవేదులైన మునులు.

71


క.

ఇలఁ బక్షుల కాశ్రయమై
ఫలియించెడి తరువు నఱకు పాపాత్ములు సం
కెలలఁ బడి ఘోరనరకా
గ్నులఁ గూలరె యమునిభటులు కొఱవులఁ జూఁడన్.

72


తే.

[3]వినుము రావియు వటమును వేము నొక్క
టొకటి బిల్వకపిత్థంబు లుసిరికలును
మూఁడు మూఁ డామ్రదశకంబు మొనసి వనము
లొనర నిల్పిన నరకము నొందఁ డెపుడు.

73


వ.

మఱియు సకలవనంబులం దులసీవనంబు పరమపురుషార్థంబు
గావున.

74


ఉ.

తులసీకానన మెవ్వరింట నలరున్ దోషాంధకారార్కమై
తలఁప న్బొల్పగుఁ దద్గృహంబు ధరఁ దీర్థం బెందు నయ్యింటికిన్
బలిమి న్గాలుని కింకరవ్రజము రాఁ [4]బట్టించు నూహింపఁగాఁ
దులసీగంధము గల్గుచోటు సుకృతస్తోమాలయం బెప్పుడున్.

75
  1. లోకంబు (మ-తి)
  2. సపతుగా (తి)
  3. ఆ. వినుము రావివటము వేము నొక్కొక్కటి, యును కపిత్థబిల్వయుసిరికలును, మూడుచింత లేను మొగిమావులును నిల్పు, నతడు నరకవాస మంద డెపుడు (మ-హై)
  4. జంకించు (మ-హై)