పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-షష్ఠాశ్వాసము

263


ఆ.

దేవహితము విష్ణుదేవు నానతియును
జేసి యివ్విధంబు చేయవలసె
దనుజబాధలకును దగిలి యీచిహ్నంబు
బాహ్యలీల యయ్యెఁ బంకజాక్షి!

177


క.

హరినామసహస్రముతో
సరియగు శ్రీరామమంత్రజప మతిభక్తిన్
బొరొబొరిఁ బఠియించుచు ని
ర్భరసౌఖ్యముఁ బొందుచుందుఁ బద్మదళాక్షి!

178


క.

అని పరమరహస్యం బగు
ననుపమవర్తనము చెప్పి హరుఁ డాగిరిజం
గనుఁగొని యిఁక నే కథనము
వినిపింపుదు ననిన నగజవిభునకు ననియెన్.

179


క.

శ్రీమంతుఁడైన విష్ణుని
నేమఱి చరియించు విప్రు లెవ్వరు మఱి యా
తామసశాస్త్రంబులకును
నామము లేవేవి చెప్పు నాగాభరణా!

180


వ.

అనిన విని శివుండు కాత్యాయని కిట్లనియె.

181


క.

తామస రాజస సాత్త్విక
నామములౌ పరమదర్శనంబులు వానిన్
బ్రేమంబున వివరించెద
నామహిమలు చిత్తగింపు మంబుజనయనా!

182


సీ.

ప్రథమంబు శైవంబు పాశుపతంబును
        బరఁగ నాచేఁ జెప్పఁబడి వెలుంగు
[1]మొగిఁ గణాదుండను మునిచేత వైశేషి
        కము నాఁగ నొప్పు గౌతమునిచేత

  1. నొగి (ము-యతిభంగము)