పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-షష్ఠాశ్వాసము

233


నను నామంబులం గలిగిన యష్టశక్తులు నద్దేవిం గొలిచి
యుండ్రు శంఖచక్ర[1]శార్జ్గంబులు పురుషరూపంబులు వహించి
యాలోకంబు రక్షించుచుండు నది ద్వితీయవ్యూహం బని చెప్పి
వెండియు.

42


క.

వ్రతముల నుపవాసంబులఁ
గ్రతువుల నధ్యయనములను గలుగదు లక్ష్మీ
పతిపురము ద్వాదశాక్షర
యుతమంత్రప్రవణులైన నొదవుం దరుణీ!

43


క.

హరిమంత్రము జపియించుచు
హరిభక్తిరసాబ్ది నోలలాడుచు నెపుడున్
హరిదాసులైన పుణ్యులు
హరిపదమునఁ జెంది మరల రంబుజనయనా!

44


వ.

మఱియు ద్వితీయవ్యూహంబు చెప్పెదఁ జిత్తగింపు మని సర్వ
మంగళకు సర్వజ్ఞుం డిట్లనియె.

45


శా.

శీతాద్రీంద్రతనూభవా! విను మహాశ్రేయస్కరంబై జగ
త్ఖ్యాతంబైన జలాబ్ధి యుత్తరమునం దారూఢమై నిత్యమై
పూతంబై హరిభక్తియోగజనితాభోగాఢ్యమై రమ్యమై
శ్వేతద్వీపము శుద్ధసత్త్వమయమై చెన్నారు నత్యున్నతిన్.

46


వ.

అందు బ్రహ్మమానసపుత్త్రులైన సనక సనందన సనాతన సనతు
జాత సనత్కుమార వంశశిఖాదులగు పరమయోగీశ్వరులును పరమ
విరక్తులును భగవద్భక్తిరసామృతసేవకులును నరనారాయణు
లును హరిసన్నిధి ననవరతంబును సేవింతురు ధవళాంశుకోటి
సంకాశంబును నానారత్నమయంబును నంతానతరులతాకీర్ణంబును
వికచకమలకుముదగంధబంధురజలాశయయుతంబును నై
పొలుపు మిగిలిన యద్దీవిమధ్యంబున నమరావతిపురంబు గల
దది యెట్టిదనిన.

47
  1. గదాఖడ్గ శార్జ్గంబులు (తి-హై)