పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-షష్ఠాశ్వాసము

231


క.

కోయిలలు సామగానము
సేయుచు నేప్రొద్దు నచటఁ జెలఁగుచునుండుం
బాయక శుకచయము సహా
ధ్యాయిగ నచ్చోటఁ గలుగు [1]నారామములన్.

35


తే.

అట్టి లోకంబు నడుమఁ బెం పగ్గలించి
ద్వారవతినాఁగ నొప్పారు తోరణముల
[2]మడుఁగులఁ బసిండిమేడల మందిరముల
[3]వప్రములచేత నప్పురవరము వొలుచు.

36


సీ.

యౌవనంబునఁ బదియాఱేండ్లప్రాయంబు
        వారయా పురిగల వనిత లెల్లఁ
బంచబాణునికంటె మించినరూపులఁ
        బొల్తు రచ్చటఁ గల పురుషు లెల్లఁ
జెలి లచ్చితో నాడు చెలికత్తియలయందు
        బెనుపొంద వర్తించు పేరటాండ్రు
దైత్యారివెంటఁ దద్ధామంబునందుండి
       చనుదెంచినార యచ్చటి గృహస్థు


ఆ.

లనఁగ నిత్యలక్ష్మి కాధారభూతమై
వగయు వగయులేక నిగమవితతి
మ్రోయుచుండ సిద్ధమునినాథసేవ్యమై
యొప్పు మిగులుచుండు నప్పురంబు.

37


వ.

మఱియు ననేకమణిమయాలంకారులును దివ్యాంబర[4]స్రగ్గం
ధాదివిరాజితులును శంఖచక్రఖడ్గగదాహస్తులును హరిభక్తి
పరాయణులును నగు పురుషు లతిమనోహరాకృతులును లక్ష్మీ
సమానలావణ్యవతులును గనకకమలపాణులు నగు సుందరులతోఁ

  1. నారామమునుల్ (ము)
  2. మాడుగుల (తి-హై)
  3. పత్రములచేత (ము)
  4. స్రద్గంధాది (ము)