పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-పంచమాశ్వాసము

193


క.

ధరణీదేవుఁడు దగ సం
స్కరణానలతప్తశంఖచక్రాంకములం
గరమూలంబుల భక్తిని
ధరియించిన యేని హరిపదంబునఁ జెందున్.

59


ఆ.

చక్రమైన శంఖచక్రంబులైనఁ బం
చాయుధంబులైన నగ్నితప్త
ముగ భుజంబులందు మొగిఁ బూని బ్రాహ్మణుఁ
డాచరింపవలయు నర్హ[1]విధులు.

60


వ.

ఇ ట్లాచరించిన విప్రుండు ఘోరనరకదూరుండై విష్ణుసాయు
జ్యంబు నొందు.

61


క.

చక్రాంకరహితుఁ డగుచుఁ ద్రి
విక్రముఁ బూజించునట్టి విప్రుని జపదా
నక్రతుపూజాధ్యయనా
దిక్రియ లవి నిష్ఫలములు [2]దేవీ! తలఁపన్.

62


క.

ఉపనయనవేళఁ బాప
వ్యపగత హోమాగ్నిఁ గాఁచి యాతనిఁ జక్రాం
కపునీతుఁ జేసి పిమ్మట
నపరిమితబ్రహ్మకర్మ మగుఁ జేయింపన్.

63


చ.

భుజముల శంఖచక్రములు [3]పూనని విప్రునిఁ బైతృకాదిస
ద్భజనము చేయఁ గాదు విదితంబగు గోతిలభూహిరణ్యదా
నజపములైన రాక్షసగణంబుల పాల్పడుఁ గాన నుత్తమ
[4]ద్విజుఁడగు శంఖచక్రధరు నెంచి యొనర్చుట మేలు దానముల్.

64
  1. విధుల (ము)
  2. గావే తలఁపన్ (ము-యతిభంగము)
  3. పూనిన (ము)
  4. ద్విజులకు (ము)