పుట:నారాయణీయము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20


"కని దై త్యేంద్రుఁడు త్వత్తనుద్యుతుల కాకంపించి కై వంచి యి
 ట్లనియె౯ 'నాయెడ నేమికోరెదవు కుఱ్ఱా! షడ్రసోపేత భో
 జనమా ! కాంచనమా ! మణిభవనమా ! సర్వంసహారాజ్య రం
 జనమా ! స్త్రీజనమా ! యేదే నడుగుమా ! సందేహమా ? నీకిట౯".

గొగ్గిపద మొక్కటియు లేక కమ్మచ్చునఁ దీసినట్లుసాగిన యీ పద్యమువంటివీ గ్రంథమునఁ బరశ్శతము లున్నను ఇయ్యది శ్రవణమాత్రముననే మృదంగ వాద్యానుకారమగుట యొక విశేషము. ఇందలి యంత్యానుప్రాస మయత్న సిద్దము కావుననే కాంచనమా, మణీభవనమా' అను రెండు పదములును జకారము విడిచియుఁ బ్రయుక్తములైనవి, కావున నే రమణీయార్దరములైనవి. అంతియకాని, భోజనమా, రంజనమా, స్త్రీజనమా. అను వానిలోని ఛేకమున కనువుగఁ బై రెండు పదములలోఁ గూడ నెట్లో పిసిగి, పిండి, శ్రమించి జకార సంపాదనముచేసి ముడి వెట్టినచో ననుప్రాసము కుదురవచ్చును. అర్ధమస్తావ్యస్తము కావచ్చును.

పిదప 'రక్షోనాథువంశమ్ము వర్ణనముం జేసి 'పదత్రయం మ్మొసఁగుమన్నా! చాలు నన్నావు, అని — 'కాదని సర్వమ్మును నీవయై యడుగ వహ్వా నవ్వరే యెవ్వరు౯' అని యర్థాంతరన్యాసమున చక్క సమర్థించుట యెంతయు హృదయంగమముగా నున్నది. మఱియు త్రివిక్రమస్వరూపము చెప్పుపట్టున “ఆబ్రహ్మాండ భాండమ్ముగా, నమ రె౯ నీదగు దివ్యరూపమది యింతం తౌచు నంతంతయై' అను దానియందలి వ్యంగ్యము జీవనాడియై కావ్యమునకు శోభ గూర్చుచున్నది.

దేవకీ వసుదేవులను వివాహానంతరము రథ మెక్కించి సాగనంపుచున్న కంసుఁడు అశరీర వాక్కు వలన మృత్యుభయము కలిగి, చెల్లెలిని జంపఁబూను ఘటమున నొక చిత్రము.

“అంతట నూత్న దంపతుల నంపుచు సారథియై రథాన 'ని
 క్కాంతకుఁ గల్గు నెన్మిదవ గర్భము నిన్ ఖలు జంపు' నంచు బ
 ల్వింతగ నీదు పల్కె వినువీధి వినంబడఁ గంసుఁ డన్న సం
 భ్రాంత మనస్కుడై కొనెఁ గృపాణముఁ జెల్లెలి సంహరింపఁగన్."

అని మూలానుసార మనువదింపఁబడియు,