పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/642

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

హరి మెఱసె రత్నమౌళ్యు
త్తరుఁడై నూతన[1]ఘనాంబుదస్ఫూర్తులతో
స్ఫురదుదయాచల[2]మత్సర
నిరతిన్ బాలార్కుతోడి నీలాద్రి యనన్.

22


ఆ. వె.

అతని యాననము సమంచితకుండల
ద్వయవిభాసి యగుచుఁ దనరె నికట
విలసదుచితకాంతి వెలయు బాలారుణ
ద్వయసుపార్శ్వనవ్యవనజ మనఁగ.

23


క.

తగఁ గౌస్తుభమణిబింబిత
మగు జగము వహించి నిలుచు నచ్యుతరూపం
బగణేయవిశ్వరూపా
ధిగతంబై నిలిచినట్ల తేజము నందెన్.

24


క.

చిత్రతరరత్నభూషా
పాత్రములై శౌరిదివ్యబాహువులు నిజ
స్తోత్రహిత[3]ఫలదనవపు
ష్పాత్రత్యసురద్రుశాఖలై దీపించెన్.

25


క.

శ్రీమంతములై తత్పద
తామరసము లమరె నఖరధామముతో ను
ద్దామజ్ఞానసుకృతకీ
ర్త్యామోదశ్రీలు నతుల కర్పించుగతిన్.

26


వ.

ఈరీతి విజృంభించిన నయ్యీశ్వరుండు ధ్రువునిం గాంచి దంతాంశు
సంజ్ఞామృతప్రవాహంబుచే గాత్రరేణువుం దొలంగింపుచు వరంబుఁ
గొనుము. మద్ధ్యానాంచితేంద్రియనిగ్రహంబున; [4]దుష్కరమనో
నిరోధంబునం జేసిన తపంబునకు మెచ్చితి. వాయునిరోధంబు చేసి
నాయందుఁ జిత్తంబు నిలిపినవాని మదాజ్ఞచే సుదర్శనంబు రక్షించు.
సాధుబుద్ధి యగు నీవంటి ప్రపన్నుండు మన్మాయ జయించి బ్రహ్మ
పరాయణుం డయ్యెనేని వానికి వరంబు లిచ్చుబుద్ధి నన్నుఁ ద్వరసేయు
చుండు నని యానతి యిచ్చిన నచింత్యమానంబై మూర్తంబై ముందర

  1. ఘనాధున
  2. వరమత్సరమున బాలార్కు
  3. ఫలదసపుష్పాత్రత్వ
  4. దుష్కర్మ