పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/619

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

ప్రవిజితదిక్పాలపట్టణానీతసు
                       మంగళవస్తుసామగ్రి మెఱసి
యప్సరస్సిద్ధవిద్యాధరకిన్నర
                       కింపురుషాదిసంకీర్ణ మగుచు
నమరావతియుఁ బోలి యబ్జభవోపమ
                       బ్రాహ్మణుల్ మనునిభరాజవరులు
వైశ్రవణాదికవైశ్యులు కాలాంత
                       కనిభనాయకులు ప్రకాశ మందఁ


తే. గీ.

జిత్రగుప్తోపమానసచివులు గలిగి
యఖిలలోకంబులు నుతింప నతిశయిల్లె
నతలలోకనిధానగర్భాంతరాళ
సమధిపూరితశౌర్యవిత్త మయి మించి.

146


తే. గీ.

శతదళోచ్ఛ్రాయవిస్తారసారరత్న
మంటపస్తంభ యగు దాని మహిమ లెంచ
నజహరాదుల కేనియు నలవి కాదు
ఘనతఁ గొనియాడ నింతపట్టణము గలదె?

147


ఉ.

ఆవరరాజధాని నసురాగ్రణి శ్రీనరసింహదేవతా
భావిశుభావతారముప్రభావము [1]మున్న యెఱింగి నిల్చి ధా
త్రీవలయంబు బెగ్గడిల దిగ్విజయం బొనరించెఁ బెక్కు మా
ర్లావిభునాజ్ఞ యింద్రవరుణాదిసుర ల్తలఁ దాల్చి కొల్వఁగన్.

148


వ.

మాయసురవీరుం డగువాఁడు లోకప్రత్యయార్థంబుగా దుష్కర
తపంబు చేసి పద్మసంభవుఁ బ్రసన్నుం జేసికొని యిష్టవరంబు
లి ట్లని వేఁడుకొనియె.

149

హిరణ్యకశిపుండు బ్రహ్మవలన వరంబులు పడయుట

సీ.

ఓ దేవ కరుణాపయోధి నాకప్రతి
                       పత్త్రతాదయి కాధిపత్య మొసఁగు
మమరగంధర్వయక్షాసురోరగసిద్ధ
                       గరుడవిద్యాధరఖచరసాధ్య

  1. ము న్నెఱింగి