పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/523

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

ధన్యుఁ బౌరాణికమణి మీతండ్రిఁ జూచి
హృషితరోమాంకురములతో నెసఁగి రోమ
హర్షణాఖ్య [1](నొ)సంగె నవ్యాసమౌని
యట్టి ఘనుని కుమారుండ వనఘచరిత!

45


క.

నీవును నటువలెనె య(మిత)
పావనుఁడవు తత్వబోధపరిశిష్టశుకాం
తేవాసివి సులభము నీ
కావిశ్వప్రశ్ననిశ్చయంబు [2]మహాత్మా!

46


తే. గీ.

చెలఁగి నారాయణోదయాచలముమీఁదఁ
బ్రబలు తత్తత్వనిశ్చియ పద్మమిత్రుఁ
డలరు భవదాదిధాతృపర్యంతవిబుధ
విష్ణుపదగతదీప్తిచే వెలయు దిశల.

47


స్రగ్ధర.

సూతా పుణ్యప్రసూతా! సుచరితభరితా!
          శుద్ధసత్వోపదేశో
ధ్భూతాభ్యాసక్రియావిస్ఫురితబుధమనోం
          భోజభావ్యంబు దుస్త
ర్కాతిస్ఫీతానువృత్యత్యవధివిపథదూ
          రాతిదూరంబునై వి
ఖ్యాతం బాతత్వబోధం బధితముగఁ జే
          యంగ నీకంటె నేరీ!

48


మ.

శ్రుతికల్లోలసముద్గమోద్భటరసస్ఫూర్తిన్ విజృంభించి య
న్వితవేదాంతవిచారసారమణియై విద్యానదీవిభ్రమాం
చిత (మా)సద్గురుసంప్రదాయజలధిన్ శ్రీవిష్ణుశాస్త్రాంబువుల్
రతిమైఁ గ్రో[3](లి) ఘనుండవైతివి చికిత్సాభావ మి ట్లార్పవే.

49
  1. నెసంగె (రోమహర్షణుఁ డనుపేరు వ్యాసునకు లేదు కావున నొసంగెగా మార్పు గావింపబడినది.)
  2. మో
  3. లె