పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/503

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నవ్యయుండును, నిరాధారుండును, నిష్ప్రపంచుఁడును, నిరంజనుం
డును, విష్ణుండును, శూన్యుండును, వేదస్వరూపుండును, ధ్యేయుం
డును, ధ్యేయవర్జితుండును, నస్తినాస్తివాక్యవర్తియు, దూరవర్తియు,
నంతికవర్తియు, మనోగ్రాహ్యుండును, బరమధామపురుషాఖ్యుం
డును, జగత్రయజనహృత్పంకజసమాసీనుండును, దేజోరూ
పంబును, నిరింద్రియుండును నగు స్వామియందు లీనుం డయ్యె.
కార్యంబు సాధింపక వేతనంబు గొను భృత్యుండు నరకం బనుభవించి
లతాగుల్మాదిరూపంబున జనించు నేను భర్తృపుత్రవినాశినినై
యెట్లు వరంబు వేఁడుదు ననిన నిర్జరు లిట్లనిరి.

197


క.

నీమదిఁలో గల కోరిక
నో మోహిని! మమ్ము నడుగు మొసఁగెదము యశ
శ్శ్రీ మించ నీఋణం బిఁక
మామీఁద ఘటింపకుండ మంజులవాణీ!

198


తే. గీ.

రాజుతోఁ గూడ నతిపరిశ్రమము నొంది
యస్మదర్థంబుగాఁ గలహం బొనర్చి
యింత చేసితి విశ్వాసహితగుణమున
ననుభవింపుము తత్ఫలం బైన వరము.

199


వ.

అనునంత [1](రుక్మాంగదు పురోహితుండు).

200

పురోహితుఁడు మోహినిపై కోపించుట

సీ.

అంబుమధ్యమునఁ బ్రాణాయామపరతమై
                       నబ్దశతంబు నవ్యయు నమేయు
నారాయణుని మనోనలినంబునం దాన్చి
                       తద్వ్రతాంతంబునఁ దజ్జలంబు
వెడలి మోహిని సేయు విపరీతకృత్యంబు
                       విని దేవతలఁ జూచి విపులరోష
[2]శీలయై నిపు డెంత చేసె నీదుర్మేధ!
                       వేధ యి ట్లేల కావించె దీని?

  1. తరువాతిభాగమును బట్టి యిక్కడ నీపద ముండవలసినదిగా గానవచ్చుచున్నది.
  2. ఈపాదమున యతిభంగము శక్తిమై యని మార్చినం గుదురును.