పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/502

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


కలిగిన నేమి విఘ్నము లేక వైశాఖ
                       [1]సితపక్ష మేకాదశీదినమున
సారంబు గాఁగ విష్వక్సేనపూజఁ గా
                       వించెఁ దన్మహిమఁ బవిత్రుఁ డయ్యెఁ,


తే. గీ.

గొడుకుఁ ద్రికరణశుద్ధిగా నడపఁజూడ
నబ్ధిజాజాని ప్రత్యక్షమై కుమార
దారసహితునిఁగా నిజతనువునందుఁ
దాల్చుకొని యేఁగె నౌర! తద్ధర్మమహిమ.

193


క.

సారతరంబగు ధర్మము
ప్రారంభించినను వేగ ఫలియించు విధి
ప్రేరణమునఁ గాకున్నన్
నేరం బింతయును లేదు నిఖిలజనులకున్.

194


తే. గీ.

[2]త్రికరణంబుల నీవు పూనిక నొనర్చు
యత్న మీడేరకుండిన నబల! నీప్ర
గల్భతకు మెచ్చి వర మొసంగం దలంచి
వచ్చినారము తెలుపు నీవాంఛితంబు.

195


ఉ.

వంచన మింతలేక యనివారణశక్తి వంచించునట్ల యూ
హించి యొనర్పఁ గార్య మొకయింతయుఁ గాక నిరర్ధమైనఁ గ
ష్టించిన లాగు చూడక హసించిన యానరుఁ డందు ధాత్రిలో
నెంచఁగ గోవధాదికము లెన్నియుఁ జేసిన పాపసంఘముల్.

196


వ.

కావున నీవు దేవకార్యనిమిత్తం బింత నిష్ఠురకృత్యంబు గావించితివి.
ద్వాదశిమహిమ భగ్నం బయ్యె నైన నేమి? వరంబు వేఁడుమనిన
మోహిని వారిం జూచి యేమి సాధించితి? యమపురంబుఁ బూర్ణంబు
గావించితినో? హరిదినంబున భుజింప సమకట్టితినో? రుక్మాంగదుని
మోహాబ్ధి ముంచితినో? అతం డీదండధరుని తలఁ ద్రొక్కి యప్ర
మేయగుణాఢ్యుండును నిర్మలుండును నిర్మలాశ్రయుండును హంసం .
బును శుచిషన్మూర్తియు, వ్యోమంబును, బ్రణవంబును, జీవుండును,

  1. "సితపక్ష యేకాదశి” ఇది వ్యాకరణముచే సాధ్యము కాదు. 'సితపక్ష మేకాదసిదినమున' అనువిధముగా నున్నచో సరిపెట్టుకొనవచ్చును.
  2. ఈపాదమున యతిభంగము. కాని పూర్వపద్యాంతముం గల ద్రుతమును బురిస్కరించుకొని "౦ద్రి"గా భావించినచోఁ గుదురును.