పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొట్టమొదట యెన్నిపాదాలు యెన్నిఅధ్యాయాలు యెన్నిశ్లోకాలు ఉన్నాయో సాధికారంగా ప్రమాణపురస్సరంగా మనం యేమీ చెప్పలేము. లభ్యమై నారదీయమహాపురాణంపేరుతో ముద్రితమైన నారదీయపురాణంలో పూర్వోత్తరభాగాలపేరుతో రెండుభాగా లున్నాయి. పూర్వార్థం నాలుగుపాదాలుగా విభజింపబడి ఉత్తరార్థం పాదవిభజనరహితంగా ఉన్నది - పూర్వార్థంలో నూట యిరవైయైదు అధ్యాయాలూ ఉత్తరార్థంలో యెనభైరెండు అధ్యాయాలుగా మొత్తం గ్రంథం 207 అధ్యాయాలతో ఉన్నది. పూర్వార్థంలో 12,774 శ్లోకా లుండగా ఉత్తరార్థంలో 4,525 శ్లోకాలున్నాయి. అంటే ముద్రితమైన నారదీయపురాణంలో మొత్తం 17,299 శ్లోకా లున్నాయన్నమాట.

ముద్రితమైన ఈ నారదీయపురాణంలో అధ్యాయ విభజనాత్మకంగా వివిధశ్లోకాలలో ఈక్రిందివిషయాలు వర్ణితాలైనాయి.

ప్రథమః పాదః

ధర్మకామార్థ మోక్షోపాయా న్వేదితుం శౌనకాదిభిః కృతే
ప్రశ్నే సూతస్య నారదాయ సనకాదిభిర్నిరూపిత పురాణస్య
నారదీయస్య కథనోపన్యాసే పురాణమాహాత్మ్యకథనమ్॥

1వ అధ్యాయం


బ్రహ్మసభాప్రస్థితసనకాదీనాం గంగాతీరే విష్ణుప్రసాదనో
పాయబోధనాయ నారదప్రశ్నే పురాణోపన్యాసే విష్ణుస్తుతి॥

2వ అధ్యాయం


భగవద్విరచితసృష్టినిరూపణప్రసంగేన భూగోళవర్ణన
భరతఖండోత్పత్తి ప్రాశస్త్యవర్ణనమ్॥

3వ అధ్యాయం


హరిభక్తి నిరూపణే మృకండ మునేస్తపసా తోషితస్య భగవ
తో౽హం తవపుత్రతాం యాస్యామీతి మనోభీష్టవరప్రదానమ్॥

4వ అధ్యాయం


మార్కండేయస్య ప్రళయదర్శనాంతే పురాణసంహితాం
విరచ్య పరంపదమేష్యసీతి హరేర్వరవితరణమ్॥

5వ అధ్యాయం


గంగాయమునయోః సమాగమా త్ప్రయాగక్షేత్రప్రశంసా
పూర్వకం గంగామాహాత్మ్యకథనమ్॥

6వ అధ్యాయం


గంగామాహాత్మ్యప్రసంగేన రిపుజితస్య బాహు భూమిపతే
రౌర్వ మునే రాశ్రమ సవిధే మృతస్య గర్భవత్వాః సహ
గమనోద్యతాయాః ప్రియపత్న్యా మునికృతః సహగమననిషేధః ॥

7వ అధ్యాయం