పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

ధనదుగర్భంబునందు నీతరళనేత్ర
వత్సరత్రయంబు వహించి వాసిఁ గనియె
సాధ్వి! భవదీయపూర్ణప్రసాదమహిమ
వన్నె మెఱయంగ నే నింతవాఁడ నైతి.

283


తే. గీ.

ఇందుముఖి! నాకు జనయిత్రు లెందఱేని
కల్గినం గల్గనిమ్ము లోకములు మెచ్చ
సాధ్వి యీకాంత నిజఘనస్తన్యపాన
మహిమఁ బోషించె న న్నసమానవృత్తి.

284


తే. గీ.

జనని [1]ప్రసవైకవేదన జాలిఁ జెందె
నన్ను నొక్కనిఁ గాంచి యెన్నంగఁ దనువు
శిథిలబంధంబు గాఁగ గాసిల్లె నాకు
నాఋణముఁ దీర్ప మఱి యుపాయంబు లేదు.

285


క.

జననీజనాంకతలమున
దినదినపరివృద్ధిఁ బెరిఁగితి న్నాకంటెన్
ఘనుఁ డెవ్వం డినుఁ డెవ్వం
డనఘుం డెవ్వఁడు తలంప నంబుజవదనా.

286


సీ.

బాలకుమారిక భర్తృసౌఖ్యం బెఱుం
                       గనియట్ల జననియంకంబునందు
మహిమ నుండక కాని మాతృసౌఖ్యముఁ గనఁ
                       డిట్లు మాతాపితృపేతుఁ డొకఁడు
కలుగఁడు జగతి నొక్కట లీలఁ దల్లియం
                       కమునందుఁ [2]బెరిఁగిన కొమరుఁ డతుల
దర్పుఁడై శంభుమస్తకచంద్రకళఁ గరం
                       బునఁ బట్టి తివియంగ భుజబలంబు


తే. గీ.

గలిగి తమకించు జనని యొకర్తు పనుప
[3]జనక హీనతనున్నఁ దజ్జనుఁడు జగము
లన్నియు హరింపఁ దలఁచు శౌర్యమున నట్టి
పటిమ గాదె ప్రసూస్తన్యపానశక్తి.

287
  1. ప్రసవైకవేదనఁ జాలిఁ జెందె
  2. బెరిగిన యతండు సారదర్పుఁడై
  3. జనకహీనత నున్నతజజనుఁడు