పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

ఇ ట్లన్యోన్యసల్లాపోత్ఫుల్లమానసులైన వారియగ్రంబునకు శిష్య
సహితుండై పరాశరుండు చనుదెంచి దత్తాత్రేయునకుఁ బ్రణామం
బాచరించి తదనుమతంబునఁ గుశలంబు విన్నవించి నిజాగమనకారణం
బేది యనిన నిట్లనియె. పులస్త్యవసిష్ఠవరదానంబునఁ దత్త్వమంతయు
నాకుఁ బ్రకాశంబయ్యె. మైత్రేయునకు నది విన బుద్ధి వొడమె. నీ
సర్వోత్తరదేశంబున నిలిచెద. నారాయణమునీంద్రుండు బదరి
కాశ్రమంబున కంటె నారాయణాచలంబు నాకుం బ్రియం బనియె.
మునిస్థానంబునుం గలదని యానతి యిచ్చి యిచట విష్ణుపురాణం
బితనికి బోధింపుమనినఁ దద్వచనంబునంబని వింటి. ఆ నారాయణుం
డన నీవే వేదపురాణాదుల కన్నింటికి నీవే ఫలంబు నేఁడు నాదృష్టికి
నమృతపారణంబయ్యె [1]నను పరాశరునకు దత్తాత్రేయుం డిట్లనియె.

26


క.

తత్త్వము నీ విక్కడ [2]విని
తత్త్వమున యథార్థఘటన దగ బోధింపన్
సత్త్వాధికుఁ డవును సుధీ
సత్త్వాధికుఁడవును నీవె చతురత నరయన్.

27


క.

ప్రియమా సర్వోత్తర మతి
శయమున నేతత్పురాణసారం బిట్లన్
బ్రియతమమై కర్ణామృత
మయి మెఱయన్ వినియెదను నయంబున నేనున్.

28


ఆ. వె.

అని యనుజ్ఞ నొసఁగ నాపరాశరముని
హరియ పరమతత్త్వ మనుచుఁ దెలుప
విమలరూపమైన విష్ణుపురాణంబు
సంఘటించె శుద్ధసత్త్వమయము.

29


సీ.

తనదు కల్యాణతీర్థమునకుఁ గించిదు
                       త్తరభాగమున మహోదారమగు వ[3]
రాశరాశ్రమ మఘరాశిమాలానల
                       మాతీర్ధమణి ప్రతీచ్యంతరమునఁ

  1. ననుచుఁ బరాశరునకు – అర్థము సరిపడదు.
  2. వని
  3. వని