పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నొందింతురు. కొంద ఱాత్మ దేహభిన్నం బని యెఱింగియు నాదేహంబు
నకు క్షణవినాశత్వంబు తర్కకర్కశులై పల్కుదురు. కొందఱు
దేహవ్యతిరిక్తంబైన యాత్మకు నాదేహంబునందు నుండుట నంగీకరించి
యంతర్యామి లేఁడందురు. కొంద ఱాపురుషుని శేషకారణం బని యంగీ
కరించి బ్రహ్మఁగాని తదన్యునింగాని యొకనిఁగాఁ బ్రతిపాదింతురు.
చిదచిద్రూపభేదంబున జీవేశ్వరవిభాగంబు గావించి ప్రమాణసిద్ధమై
సకలంబు నొక్కటియే యని పల్కు దురాత్మ తన్మాత్రరూపంబు
గాని జీవుండు గాఁ డీశ్వరుఁడు గాఁడు. ఆదేహమునకంటె నధికంబగు
వివర్తములను దానికంటె నధికముగాను[1] గొందఱు పల్కుదు రిది
విష్ణుమాయామోహితులై ప్రతిభామాత్రశరణులై పలికిరి. ప్రవాదకు
లైనవారు వాదంబులు ప్రమాణవిరోధులై నిరాలోకంబైన లోకంబును
నిందించిన నంత నాజ్ఞానంబు విస్తృతంబైన కలశాంబుధియందు విష్ణు
పాదంబులం బడి వేదంబులు మొఱలిడుచు మాధవా! సమస్తచిదచిద్వస్తు
శేషివి నీ వగుట యీయర్థంబునందు ననాదినిధనంబులగు మేమే
ప్రమాణంబు సత్త్వస్థు లిందులకుం బ్రమాత లెవ్వనికి నేతత్త్వంబు
దోఁచు నాతత్త్వంబు దైవతం బండ్రు. వీనికిం బ్రమాణము పాషండ
వాదములు మ్లేచ్ఛదేశనివాసు లిందులకు దేశికులై యుండ్రు. విశుద్ధుండగు
నాత్మకు స్నానాదులచేత నెటుల సిద్ధి యగునని స్నానాదికం బిచ్ఛా
వాదంబుచేత లుప్తంబు గావించి దుర్విజ్ఞానానువర్తులచేత వర్ణాశ్రమా
చారంబులు వదలియుం డ్రధ్యాత్మజ్ఞానంబు లింటింట నన్యప్రకారంబున
నుండుం గావున విజ్ఞానంబు నిర్వహింపవే యీశ్వరా! యని వేదంబులు
విన్నవించిన శ్రీపతి యిట్లనియె.

5


మ.

ధరణీమండలి నే గురుండ నయి శాస్త్రంబుల్ ప్రకల్పింతు మీ
రురుతేజంబున శిష్యులై మెలఁగుఁ డన్యోన్యానువాదంబునన్
చరితార్థత్వము గల్గి గెల్చెదము పాషండాలి నేఁ డంచు నా
హరివిద్యానియతాత్ముఁడై మెఱసి దత్తాత్రేయుఁ డయ్యెం ధరన్.

6


సీ.

కౌపీనకవచ[2]శిక్యత్రిదండ్యుపవీత
                       ములు పంచయాత్రంబు లలవరించి
మస్తశిఖాభిరామ్యంబును లలితోర్ధ్వ
                       పుండ్రచిహ్నములు ప్రభూతలీల

  1. గానున్ను అని వ్రాతపతి
  2. శిష్యత్రిదండ్యుపవీత అని వ్రాతప్రతి. (యతిభంగము)