పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మయూరవృత్తము.

పతగకేతన! వ్రజనికేతన! పాపశాశన! పూతనా
సుతనుదారణ! దురితవారణ! నూరితోషణకారణా!
యతిదృగంజన! యార్తిభంజన! యాప్తరంజన! యంజనా
ద్రితసుభాసుర! విదళితాసుర! దీప్యమానమహీసురా!

252

గద్యము
ఇతి శ్రీమత్కంజర్ల కొండమాచార్య
పాదారవిందమిళిందాయమాన చెన్నయామాత్యపుత్ర,
కాశ్యపగోత్రపవిత్ర శ్రీమదల్లాడు నరసింహ ప్రణీతంబైన
నారదీయపురాణంబునందు ద్వితీయాశ్వాసము.
శ్రీకృష్ణార్పణమస్తు.