పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

కులికె నొకసిరియూధికాకుటజనీప
కేతకీకుసుమములు ప్రభూతమహిమ
మొనసి ఘనతరవనదుర్గముల దళంబు
లేర్పడ ఘనుండు మన్నించె హెచ్చుగాఁగ.

121


వ.

అప్పుడు.

122


క.

మురళీనాదము చేసెను
హరి హరిణిమానసంబు లానందకళా
భరణీభవభృతివద్వయ
శరణీభవదమృతసారసాగరములుగన్.

123


వ.

అంత.

124


క.

పొదలె నరవిందసంపద
కదలెఁ దటిల్లతలవేశ కాశజలక్ష్ముల్
మెదలె మరాళగణములకు
వదలెం గడు మానసాధివాసప్రేమల్.

125


సీ.

అభ్రముల్ వెలవెల నయ్యెఁ బంకం బింకె
                       [1]నమ్ముల నెరి తప్పె నభము తనరెఁ
తారలు మెఱసె [2]జ్యోత్స్నాపూరములు పొంగెఁ
                       గలమ సస్యము పక్వ కణిశ మయ్యెఁ
గనుపట్టె సైకతోత్కరము నదుల్ స్రుక్కె
                       వృషభముల్ మత్తిల్లె విరిసె సప్త
వర్ణముల్ సొంపారె బాణాసినంబులు
                       ఘటజుపెంపున నీటఁ గలఁకదీరెఁ


తే. గీ.

జాతకంబుల యామని జాఱితారె
నలబలాకలసంభ్రమం బాశ లెల్లఁ
జాల దీపించె రాజహంసగతి నెరసె
ధరణి శరదాగమము వింతసరణిఁ జెలఁగ.

126
  1. నమ్ములు = నెమళ్ళు
  2. త్స్నానపూరము పొంగె