పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

[1]జారుపయ్యెదయు నొయారిచూపుల ముగ్ధ
                       భావంబు మెరయించు భాషణములు
కలయికలోని ప్రాగల్భ్యంబు వింతలౌ
                       సింగారములు ముద్దు చిల్కు నవ్వు
గుబ్బలు చెన్క నుల్కుచుఁ దానె పైకొను
                       నంగాంగసంగతాలింగనములు
కంకణమంజీరకాంచికాకింకిణీ
                       రవ మొప్పు నొకమిటారంపునడపు


తే. గీ.

సిగ్గు సొగసును మురిపెంబు సిరియు వలపుఁ
గ్రుమ్మ రాచంగ రాధతోఁ గూడి మెలఁగె
నఖిలమోహాంతరాతీతుఁ డైనశౌరి
వన్నె యమునాతటీవనవాటికలను.

63


సీ.

తానే పన్నీటితోఁ దళుకొత్తు కస్తూరి
                       బొట్టు వింతగ ఫాలమున నమర్చుఁ
దాన నెత్తావి వింతగ నేర్చి కట్టిన
                       [2]పూదండ లపుడు కొప్పున ఘటించుఁ
దానె కట్టాణిముత్యాలు గ్రుచ్చినపట్టు
                       రవికె చన్నుల మించ [3]నవదరించుఁ
దానె కర్పూరయుక్తపటీరరసమునఁ
                       దళుకుఁజెక్కులను బత్రములు వ్రాయు


తే. గీ.

ధవళదీర్ఘవిశాలనేత్రములయందు
శ్రీలు మెరయంగ నంజనరేఖ దిద్దుఁ
దావి వెదజల్లుపుక్కిట తమ్మలంబు
నోరు నిండించు నాపూతనారి తానె.

64


వ.

ఇవ్విధంబున.

65


క.

తీరనిమమతల యమునా
తీరనికుంజముల వింతతీ రనిపించెన్
వారక రాధామాధవ
సారకళాకేళికుతుకసారస్యంబుల్.

66
  1. చారుపయ్యెద
  2. నలదండ లపుడు కొప్పున
  3. రవికె చన్నుల మించ నలవరించు