పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

[1]పరిఖ యాదిమకచ్చపభరణ మగుట
సాల మభ్రగజోదారసార మగుటఁ
బ్రబలి తత్పురి గజకచ్ఛపప్రహారి
కన్న నేమం బొసంగదే కనకమున్న.

26


తే. గీ.

తద్రమాకాంతతోడ నాధరణికాంత
కవిత నిజరత్నమేఖల గాను[2]పింప
నంచితశ్రీలు ముచ్చట లాడినట్లు
పరిఖయును కోటయును మించె సిరుల నందు.

27


క.

మెండై యమరావతికిన్
భాండాగారంబువోలెఁ బ్రబలంబై బ్ర
హ్మాండమున వెలసె నప్పురి
నిండిన నవరత్నపూర్ణనిధులు చెలంగన్.

28


తే. గీ.

తతమదస్ఫూర్తి నైరావతం బుదగ్ర
విగ్రహంబున నెదిరి గర్వించెనేని
తదురుసప్తాంగహరణ ముద్ధతి నొనర్చి
తనరవే యందు భద్రదంతావళములు.

29


తే. గీ.

[3]జలధిలో ధారలొత్తు నుచ్చైశ్రవంబు
బలగుణాఢ్యంబె కఠినసాపత్న్యగర్వ
కలితసంగరవినుతాధికప్రతార
ణాంకము వహించె ననుఁ దదీయహయచయము.

30


తే. గీ.

నలువ మాకంటె ఘనుఁడె యామ్నాయశక్తి
నేకవచనంబు వరబుద్ధి నెఱుఁగుఁ గాని
యుభయవచనప్రకాశకయుక్తి యెఱుఁగఁ
డనుచు నవ్వీటఁ బ్రహసింతు రవనిసురులు.

31


క.

పేరై యుందురు వైభవ
శూరత్వము పూర్ణదానశూరత్వము ధీ
శూరత్వము రణధరణీ
శూరత్వము గలిగి రాజసుతు లవ్వీటన్.

32
  1. పరిఘ
  2. పించ
  3. జలధిలో దారవొత్త ఉచ్చైశ్రవంబు