పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

224 తెలుగు భాషా చరిత్ర

(=ద్రోహి), బాలకి (5-17) (= బాలిక), ఉత్పలల్‌ (5-167) (= ఉత్పలములు), కరవాలు (5-28) (= కరవాలము), మాధర్యత (7-94) సౌభాగ్యత (1-162).

7.19. తత్సమరూపాల్లో సంధి సమాన విశేషాలు : నిజోషది (1-126) (== నిజౌషధి), చక్రుమదనే౦ద్రియములు (6-68) ( = చక్షుర్మదనేంద్రియములు).

సంస్కృత శబ్దాలోను. సమాసాల్లోను తెలుగు వ్యాకరణకార్యాలు ప్రవేశ పెట్టడం-వ్యావహారికభాషారీతి. నిజోషధి- (నిజౌషధి బదులు) అనేదానిలో పరస్పరైకాదేశం. శాసనోదాహరణాలు ఇలాంటివి చాలాఉన్నాయి. రమాస్వరదేవరకు (<రామేశ్వర-). కుమారసంభవం నుంచి మరికొన్ని ఉదాహరణలు గ్రహిద్దాం : హృద్దశికాంబుజాతున్‌ 11-56) ( = దళితహృదయాంబుజాతున్‌), సుఖప్రాప్తు౦డు (10-93) (= ప్రాప్తసుఖుండు, మనఃక్షుభితుండై (2-3)( = క్షుభితమనస్కుండై కుసుమకోమలి (4-78) ( = కుసుమకోమల). కవిత్రయం ఇట్టిరూపాలను వాడలేదు.

వ్యవహారభాషలో వైరిసమాసాలు అధికంగా ఉన్నాయనటానికి శాసనభాష సాక్ష్యమిస్తుంది. దేశిని పాటించిన నన్నెచోడునిలో ఇవి అధికంగా కనబడ్డం నహజమే. అమరలేమలు, నీలికుంచి, మంత్రకాటుక, రాగదీవియలు, వీరమద్దెలలు, సురగజ్జెలు, ఇతరవేల్పులు, భక్తకూటువలు, మజ్జనబావి, సర్వాంగకచ్చడము. శాసనోదాహరణాలు : దివసపడి, నిత్యపడి, దీపగంభం, ప్రసాదతల్యెలు, చాతుర్మాస్య నెలలు, చందనముద్ద, ప్రసాదకూడు ఇత్యాదులు 1207. 2. 127). కవిత్రయం వారి రచనలో వైరిసమాసాలు ఎక్కడో ఒకటిరెండు కనబడు తున్నాయి- ప్రాణగొడ్డము వండివి.

7.20. తత్సమశబ్దాలకి దేశ్యాలకి ప్రధానభేదం _ తత్సమాలు చాలావరకు లింగబోధకప్రత్యయాలతో కూడి ఉంటాయి. .-డుజ్‌మహత్‌బోధకము, ౦బు/ మ్ము/ము అమహాత్‌బోధకము. దేశ్యాల్లో బల్లిదాదులుకొద్దిశబ్దాలు తప్ప ఇతరాలకు డుజ్‌ ప్రత్యయంచేరదు. అమహత్‌ 'ము' అనేక శబ్దాలపై చేరుతుంది.

దేశ్యాల్లో 'కూఁతు' శబ్దం విలక్షణం. దీనికి ప్రథమైకవచనంలో కూతురు అని, తదితర విభక్తుల్లో కూతు-అనే రూపాలున్నాయి. ప్రథమా బహు. కూతు-లు ద్వి. ఏకవచ. కూతు-ను. ద్వి. బ వ. కూతులను. నన్నయనన్నెచోడులలో ఇదే