పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కావ్య భాషా పరిణామం 223

ద్రుతానికి మకారం పరమైనపుడు దానితో సమీకరించబడవచ్చును. ఉదా : కమ్మని లతాంతములకున్‌ + మొనసి > కు మ్మొనసి. ఇలాగే రెన్నాళ్లు, మున్నాళ్ళు ఇత్యాదుల్లో వర్ణసమీకరణం ( < రెండ్‌ + నాళ్ళు, మూడ్‌ + నాళ్ళు).

నామం (విశేష్యం)

7.18. ప్రాఙ్నన్నయయుగం నుంచి నన్నయయుగానికి ప్రవేశించేటప్పుడు నామపదాల్లో కలిగిన స్వరూపపరిణామాలను కొన్ని గుర్తించవచ్చు.

(1) కొన్ని శబ్దాల్లో వెనుకటి యుగంలో లేని లింగబోధక ప్రత్యయం చేరింది : ప్రాఙ్నన్నయయుగం : పాఱ: నన్నయ : పాఱుఁడు (భార. 1-5-203).

(2) కొన్ని శబ్దాల్టో ఇ-ఉ ల ఉ-అ ల వినిమయం కన్పిస్తోంది. ఉదా : చేయు (కు. సం. 8-175) చేయి: నేయు (SII IV--1263 గోదావరి జిల్లా క్రీ. శ. 1100) నేయి: ముందఱు (కు. సం. 2-12) ముందఱుమఱ౦ది. (SII VI-667) ముందఱ; వలువు వలువ.

(3) శబ్దస్వరూపంలో కలిగిన మార్పు : పొదరు - (భార. వి. 3-82). అర్వాచీనరూపం పొద.

తెలుగులోని శబ్దజాలమంతా దేశ్యం, అన్యదేశ్యం అని రెండువిధాలు. అన్యదేశాల్లో తెలుగు భాషాసంప్రదాయానుసారంగా మారివచ్చిన పదాలు తద్భవాలు, అనాంధ్రవర్ణ సంప్రదాయాలతో యథాతథంగా గ్రహించబడ్డవి తత్సమాలు. ఇక దేశ్య శబ్దానుగుణంగా కొంతవరకే మారివచ్చిన శబ్దాలు కొన్ని వాడుకలో ఉండినవి. ఉదా. అద్దంకి శాసనంలో 'అస్వమేదంబు' అనేరూపం. కు.సం. లో అరుహున్‌ (2.80), కలహారగంధి (9-71), హరుషాశ్రుధారలన్‌ (12-213), బరిహికేశ భరంబు (4.102, మొ. వి. వీనిని అర్థతత్సమాలని వ్యవహరించవచ్చు. కవిత్రయంలో ఇట్టిరూపాలు లేవు.

తత్సమాలవిషయంలో నన్నయవాడుకలో వాకు, జగము మిత్రుఁడు, పాత్రుఁడు అనురూపాలేకాని వాక్కు, జగత్తు, మిత్రము, పాత్రమువంటివి లేవు. నన్నిచోడుడు వాక్కు, మిత్రము, పాత్రము రూపాలు వాడినాడు. ఇక ఈతని భాషలో కనిపించే తత్సమ విశేషరూపాలు అనేకం. ఉదా: దాసి (7-134) (= దాసుడు), వాల్మీకున్‌ (1-17) (ప్రథమ),వాల్మీకుఁడు (= వాల్మీకి), ద్రోహుఁడు (2-97)