పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0317-2 శుద్ధవసంతం సంపుటం: 11-098

పల్లవి: చెలులాల మీ రిం తేల చెప్పే రాతనికి బుద్ది
         చలివలపులు చిల్లి జాగులు సేసీనా

చ. 1: సేస వెట్టినట్టివాఁడుచేరి కాఁగిలించుఁ గాక
       ఆసలాసలె రేఁచి అట్టె వుండీనా
       వాసి వుటించినవాడు వడిఁ జింత మిచ్చుఁ గాక
      బేసబెల్లితనమున బిగువు లాడీనా

చ. 2: ససర మాడినవాఁడు చన విచ్చి కూడుఁ గాక
       తరఁగుమరఁగు లాడి తక్కి వుండీనా
       కరఁగి మెచ్చినవాఁడు కందువకుఁ దీసుఁ గాక
       సరవు లెరంగక సాదించీనా

చ. 3: దగ్గరి వచ్చినవాఁడు దయ నాపైఁ జేసుఁ గాక
       సిగ్గులు వడుచు వేరె చిమ్మి రేఁచీనా
       యెగ్గు దీర శ్రీవెంటేశుడిట్టె నన్నుఁ గూడె
       వొగ్గి నా సొమ్మాయఁ గాక వొల్ల ననీనా