పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/588

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9౦82-01 శంకరాభరణం సం: 04-584 వైరాగ్య చింత

పల్లవి:

అధమునికి నను విధాయకులు విధియించరో
విధిలోనఁ గొంత దుర్విధి నెరపినాఁడ

చ. 1:

పాతకుని పాపాలు పరిహరింపించరో
భూతంబులాల తోఁబుట్టులాల
యేతులకు హరి దలఁచి యిటువంటి యీ మేన
బూతుఁజేతలనె వొరపులు నెరపినాఁడ

చ. 2:

పాపకర్మునికి భృగుపతనంబు చూపరో
తాపత్రయములాల తమ్ములాల
దీపించు హరి దలఁచి ధృతిలేక మరి మనో
వ్యాపారములు గొన్ని వడిఁ దలఁచినాఁడ

చ. 3:

చంచలున కేది నిశ్చయవిధి విధించరో
పంచేంద్రియములాల బంధులాల
ఎంచనరుదగు వేంకటేశ్వరుఁ బొగడునోర
కాంచి యితరుల నాలికకుఁ జేర్చినాఁడ