పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0305-05 నారాయణి సం: 04-029 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

అనాది జగమున కౌభళము
అనేకాద్భుతం బౌభళము

చ. 1:

హరినివాస మీ యౌభళము
అరిది పరమపద మౌభళము
అరిదైత్యాంతక మౌభళము
హరముఖసేవిత మౌభళము

చ. 2:

అమలరమాకర మౌభళము
అమితమునీంద్రం బౌభళము
అమరవందితం బౌభళము
అమరెఁ బుణ్యముల నౌభళము

చ. 3:

అగరాజంబీ యౌభళము
అగణితతీర్థం బౌభళము
తగు శ్రీవేంకటధామవిహారం-
బగు శుభాంచితం బౌభళము