పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0031-4 దేసాళం సంపుటం: 06-181

పల్లవి:

ఎట్టు ధరించే నింకాను
పట్టుట బరువీ ప్రాయము నాకు

చ. 1:

చెప్పక వచ్చిన చిత్తము లోపలి
నొప్పులనేమై నొగిలీని
యెప్పుడు దలఁచిన వృాదయయి ఝల్లని
కుప్పలుగా మైఁ గురిసీఁ జెమటా

చ. 2:

అంపలేక నన్నంపిన యప్పటి
తెంపు దలఁచిపో దిగుల నేను
యింపునఁదా నిపు డెట్లున్నాఁడో
కంపించీ మది కటకట యిపుడూ

చ. 3:

తిరిగి చూచినను దేహము చిత్తముఁ
బరవశ మయ్యీఁ బలుమారు
తిరువేంకటగిరి దేవుఁడు కౌఁగిటఁ
గరుణించఁగఁ జీఁకటి వెడఁబాసె