పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0033-6 శ్రీరాగం సంపుటం: 06-129

పల్లవి:

రాను మీకడకు వోరమణులార పూవుం
బానుపు హరికి నేఁ బఱవవలయు నేఁడు

చ. 1:

చెలఁగి దేవుండు నేఁడు సిరితో నేఁటికి నో
పొలయలుకలవలపులు నటించి
తలఁపోఁత విరహవేదనల నున్నాఁడు ఈ
చలిమందు లతనికి చాఁతవలయు నేఁడు

చ. 2:

రమణుం డిప్పుడు ఇందిరాదేవియెదుటను
తమకించి యెవ్వతెనో తలంచెనట
కమల గోపింపం గాఁకల నారగింపండు ఈ
హిమజల మతనికి నీయవలయు నేఁడు

చ. 3:

వెలఁదిఁ బాసి తిరువేంకటేశ్వరుడు
కలికియై కౌఁగిటఁ గలసెనట
తిలకము గరఁగేటి తిరుమేనిచమట యీ
వెలినుండి పలుమారు విసరవలయు నేఁడు