పుట:కాశీమజిలీకథలు -01.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిత్రసేనకథ

257

మదవతీ! నీ హృదయసంతాపము వినినంత నాకెంతయుఁ జింతగానున్నది. మదనుండు నిర్దయుఁడై నిన్నేములుకుల నేయుచుండెనో నన్ను గూడా నాశరంబులనే బాధించుచున్నాడు. నాడెందము నీయందము లాగికొని తిరుగనీయకున్నది. మఱియుఁ జూపుగొలుసుల నా పాదంబులకు సంకిలువైచియు నప్పనిసేయనట్లు వ్రాసెదవేల? మన సంతాపముల గలిసికొనిననాఁడు తెలియఁగలవు. ఇప్పుడు నీవు వ్రాసిన రెండు తెరంగులు నాయంతరంగమున కసుకూలింపలేదు. నీవు జలింపక యించుక కాలము సైరింపుము. నీయంతఃపురమునకే వచ్చెద. అప్పుడు నిర్భయముగాఁ గ్రీడింపవచ్చును. తక్కినవిషయము లెఱింగింతున నివ్రాసి యాయుత్తరము కమ్మరఁ బూవుబంతిలోఁ గ్రుక్కి యా మేడమీద కెగరవై చెను. చిత్రసేనయు దానినందుకొని కన్నుల నద్దుకొనుచు నందలి విషయము చదువుకొని వ్రాసిన సాధకబాధకముల గుర్తించి సంతసించుచు నతనిరాక కెదురు చూచుచు దినమొకయేడు లాగున గడుపుచుండెను.

అంత బుద్ధిసాగరుఁడు చంద్రగుప్త మహారాజు నధికారవిశేషములన్నియుఁ దెలిసికొని యతఁడు సూర్యప్రతాపుఁడను రాజునకు గప్పము గట్టుట విని కతిపయప్రయాణంబులఁ గామపాలునితోఁగూడ సూర్యప్రతాపుని పట్టణమున కరిగెను. అందా కుమారు లిరువురు గొన్ని దినంబులుండి తమ విద్యాపాటవంబున సూర్యప్రతాపుని మంత్రిని మెప్పించి యొకనాఁ డతనిచే నేమికావలయునో కోరుకొనుఁడని యనిపించుకొనిరి. అప్పు డాయమాత్యుని సూర్యప్రతాపుని మూలబలము బిరుదములు శిబిరములు గొన్ని దినములు మాతో నుండున ట్లాజ్ఞాపింపుఁడని వేడుకొనిరి.

ఆ సచివు డప్పుడా సేనాధిపతుల రప్పించి వారివెంట నరుగ నాజ్ఞాపించెను. అంత నొకనాఁడు బుద్ధిసాగరుఁడు సూర్యప్రతాపుని వేషమును కామపాలుఁ డతనిభార్య వేషముఁ వైచికొని యా సేనతోఁ గూడ నడుమ నడుమ విడెదలు చేసికొనుచు నొకనాఁటి సాయంకాలమునకు జంద్రగుప్తనగరము జేరిరి.

అంతకుమున్నే సూర్యప్రతాపుఁడు తమ క్రిందదేశముల క్షేమసమాచారములు చూచుటకై వచ్చుచున్నవాఁ డనియు నాయారాజులు సిద్దముగా నుండవలయుననియు యాజ్ఞాపత్రికలఁ బంపిరి. చంద్రగుప్తుడు నా రాజురాక కెదురుచూచు వచ్చినవార్త వినినతోడనే యెదురేగి తనకిరీటమణు లతని పాదపీఠంబుల వెలుగఁజేయ మ్రొక్కిన నక్కపటసూర్యప్రతాపుఁడును నతని మన్నించి లేవనెత్తి గారవించి క్షేమముఁ దెలిసికొనెను.

పిమ్మటఁ జంద్రగుప్తుడు అపూర్వమైన యతిని మర్యాదకు మిగుల సంతసించుచుఁ దగినవిడిదెల నియమించి యందు బ్రవేశపెట్టి యెన్నియేని యుపచారములు చేయించుచుండెను. ఇట్లు రెండు మూడు దినములుండి కపటసూర్యప్రతాపుఁ డొకనాఁడు చంద్రగుప్తునితో రాజా! నీవు మాకేమైన గప్ప మీయవలసియుంటివా? యని