పుట:కాశీమజిలీకథలు -01.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింహదమనుని కథ

191

పుత్రా! మా వృత్తాంత మేమని వక్కాణింతుము. ఏ చింతయు నెఱుఁగకున్న నీకుఁగూడ విచారము గూర్చినవార మగుదుము. నీవు పుట్టినది మొదలు సంతసించుచుంటిమి. అంతకుమున్ను మేము దుఃఖించిన ఘోషంబు కొండగుహలనుండి యిప్పటికిని వెడలుచున్నది. మమ్మింతకుఁ బూర్వ మిట్లడుగువా రెవ్వరును లేకపోయిరి. నేఁటికి మా పూర్వపుణ్యంబున నీవు బయలుదేరి మా యాత్రము తెరంగరయుచుంటివి. అని యతని గారవించుచు దాము శత్రుంజయ మహారాజును బెండ్లియాడినది మొదలు సింహదమనుండు దొడమువరకు నడుమ జరిగిన వృత్తాంతమంతయుంజెప్పి యయ్యా! యింతకును నామానవతియే మూలమని కన్నీరు విడువజొచ్చిరి.

అప్పు డబ్బాలునకు వచ్చిన శోకమును రోషమును యింతింత యవి చెప్పుటకు నలవికాదు. తనుఁదాన యుపశమించుకొని కటకటా! మాతండ్రి యెంత క్రూరాత్ముఁడు! మిమ్ము నెట్టియిడుమలఁ బెట్టెను. పితృవధ మహాపాతకంబని సందియమందుచుంటిని కాని యిప్పుడే యతని లోకాంతరగతునిఁ జేయకపోదునా! ఇంతకు మన పురాకృతకర్మ మిట్లున్నది. యొకరిం దిట్టనేల? కానిండు. ఇంతటిచో నీ యాపదలు తొలఁగినజాలు. మనమీ యడవిలో నుండనేమిటికి ? ఎద్దియేని పట్టణమునకుఁ బోయి సుఖింపరాదేయని యప్పుడే కిరాతులఁ బెక్కండ్ర రప్పించి వారిచేఁ గట్టఁబడిన బొంగుసవారీలలోఁ దల్లుల నెక్కించి యాబోయలచేతనే మోయించుకొనిపోయి క్రమంబున ననేకపురంబుల గడచి చివరకుఁ దండ్రిగారి పట్టణమే చేరెను.

ఆ పురంబేలు రాజు తన తండ్రియని యెఱింగియుఁ దనకు తానుపోయి తన కథ జెప్పనేలయని రాజునొద్ద కరుగక సామాన్యగృహస్తునింటి కరిగి యదియే బాడిగకుఁ దీసికొని యందుఁ దల్లులుకు తాను నుచితవ్యాపారములచే గొన్నిదినములు గాలక్షేపము చేసెను. అట్లుండ నొకనాఁ డయ్యూరి యంగడికి యొకగుఱ్ఱము పెద్దకత్తియు నమ్మకమునకు వచ్చెను. అశ్వముఖంబునఁ గట్టబడియున్న పట్టంబున నిట్టు వ్రాయబడియున్నది.

"ఈ గుఱ్ఱము గత్తితోగూడ పదివేల రూపాయలు. ఆ కత్తిని చేత సులభముగా నెత్తినవారుగాని యీ వారువము నెక్కలేరు. ఇది భూమిమీదవలె నాకాశముమీదను వేగముగా నడువగలదు. అసమర్థులు దీనిని గొనినచోఁ బరాభవమును బొందుదురు", అట్టి శాసనముతో నున్న యా యశ్వవర్తమానమును విని రాజుగారు దానిఁ గొనదలంచి దానియొద్దకు వచ్చి తన సంస్థానములోనున్న యోధులందఱిచేత నాకత్తి నెత్తింప నిరూపించెను. అట్టిపని యొక్కఁడును చేయలేకపోయిరి.

అంతకుపూర్వమే తా నాకత్తిని కదుపలేకపోయెను. ఆ రాజు సిగ్గుపడి వచ్చిన దారింబట్టి యూరక యింటికరిగెను. ఆతురగవృత్తాంతమంతయు విని సింహదమ