పుట:కాశీమజిలీకథలు-12.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

నాభికమల పరిమళపరాగమున మెరుగుపెట్ట, శంకరుండుమోళీందుకిరణధారల మార్జనం బొనర్ప, మన్మధుండు నిటశరప్రభావం బధిష్టింపజేయద్రిభువనైకసారయై యుదయ సుందరి యనుపుత్రికారత్నమాయిల్లాలి గర్భమున బొడమెను.

అయ్యది ప్రధమసంతానసంభవం బగుటచే నప్పుడా ఫణిరాజు మహోత్స వము లనేకములు జేయించెను, సూతికాగృహద్వారముమ్రోల షష్టిజాగరణంబులయందు జేయబడిన ఘటధ్వనుల కైతవమున సంకల్పజన్ముండు జగజ్జయమునకై భూజా స్పోటనం బొనరించుచున్నట్లు తోచెను ఆ బాలికకు నామకరణాదివిధులు యథావిధిగ నిర్వర్తింపబడిన పిదప జోతి‌ష్కు లామె దేవాంశసంభూతుడగు పురుషుని బెండ్లాడగల దని వచించిరి. యోగీశ్వరుల మోక్షేచ్చయు, సజ్జనులసుచరిత్రము, దపస్వుల నియ మము, గృపణుల ధనము, భయశీలుర ప్రాణరక్షణవ్యాపారము, దినదినం బెట్లభివృద్ది జెందుచుండునో యట్లే యాబాలిక తల్లిదండ్రులు మిగుల ప్రేమతో బెంచుచుండ బెద్దదగుచుండెను.

ఇట్లు కొంతకాల మరుగ సముచితసంభారముల సమకూర్చియుంచి, మనో హరలావణ్యరసమున మెరుగుబూతబెట్టి, సమున్మిషిత త్రివళుల రంగవల్లికల దీర్చి, వక్షోజముల నుపరిభాగమున మంగళకలశలగా నమర్చియనంగ ప్రభుని ప్రథమ ప్రవే శమునకు శుభపరికరముల నలంకరించిన దివ్యసౌధమువలె నబ్బాలికామణి యంగయష్టి యలరారుచుండెును. వర్షాంతమున నొప్పుచంద్రికవలె, సానఁబెట్టిన మాణిక్యదీపిక కై వడి విలాసాంభోజకళికవిధమున, వివిధవర్ణముల జిత్రింపబడీన చిత్తరువుభాతి, స్నిగ్ధతనుచ్ఛాయలం బరగు నవయౌవనం మామెయందు బొడసూపెను.


గీ. తరుణివక్షోజలకలశాంకితంబునై న
    దివ్యవేదికమీఁద దదీయకాయ
    కాంతి వారిప్రవాహసద్గరిమ మరుఁడు
    గరము సూత్న రాజ్యోభిషేకంబు వడసె.

గీ. చంచలాలోకధారిణీసరణి మీరఁ
    బ్రావృషములీల బాల యౌవనపులక్ష్మి
    యతిశయంబుగ వహ్నించె ననవరతము
    నమల లావణ్యవాహినీసముదయంబు.

మ. పతి లావణ్యసరిద్విహారపరుఁడౌ సంకల్పజన్ముండు వి
     స్మృతి నాత్మియసుహథనోత్కరమటన్‌ జేజార్ప‌ నందందు సం
     గతమై దోచెఁ గపోలసత్పులినభాగంబందుఁ బత్రాతి చి
     హ్నితమౌమీన, మపాంగతీరసరణిన్‌ దృగూపబాణంబు, లు
     న్నతరీతిన్‌ జులుకంపుటొడ్డునను నందంబైన భ్రూపీఠమున్‌.