పుట:కాశీమజిలీకథలు-12.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

చుండుటచే నారాక గ్రహింపని దీనింబట్టి తెచ్చితి. దీని నీకొసంగఁజాలను. ప్రాణముల కన్న నెక్కుడుగ నేను బ్రేమించుచున్న నాభార్య ప్రధమగర్భమున నంతర్వత్నియై పురుడు బోసికొనుటకు బుట్టినింటికి మేఖరికయను పురమున కరిగియున్నది. శుకా మిషమున నామెం దృప్తిపరుపనెంచి దీనిం గైకొంటిని. ప్రియురాలి యభీష్టము దీర్చుట యందు ద్రిలోకరాజ్యమైనను దృణప్రాయముగదా ? కావున నీవీచిలుక నడుగుట యుడుగుమని వచించుచు యా పంజరమల్లుట ముగించి యందా చిలుకను బద్రముగా బెట్టి తన్ను గృతార్థునిగా దలంచుచు దానిని దనుసెజ్జపజ్జ నుంచికొనెను.


325 వ మజిలీ

శుకలాభము

వాని నిశ్చయంబెరిగి నే నతిచింతాకుల స్వాంతుండనై ఆహా ! ఈ చిలుకను బడయుటకు నేనేమి యపాయము బన్నుదును. వీని నింకేమని యాచింతును. హఠా త్తుగా దీనింగై కొని పారిపోదునా ! లేక యర్దరాత్రమున వీఁడు నిద్రాముద్రితుఁడై యున్నతరి దీనిందస్కరించుకొని పోదునా ? అని విచారించుచున్న సమయమున నా చిలుక యట్టహాసముగ నవ్వి ప్రస్తుతార్థమును సూచించుచు నిట్లు పద్యద్వయమును పఠించెను.


గీ. ఒకనికన్నులఁబడియుఁ జిక్కకయె పారి
    వచ్చితిని నింకొకనిచేత పట్టుబడి మ
    ఱొక్కవ్యక్తివాతిఁబడగనుంటి నహహ !
    దైవ యోగంబు మీర దుస్తరముగాదె ?

గీ. ఆరయ దేహిక నియామానుసరణినొప్ప
    జీవితాంతంబునందునఁ జావుగూర్చి
    మృత్యుముఖమున జీవితమెసఁగఁజేయు
    విధికి విశ్రాంతిలేదెంచు విశ్వమందు

ఆ మాటలాలించు పామరుండు భయోద్రేకమున మేను గగుర్పొడువఁ ద్రుళ్ళిపడి లేచి కాలికొలది బరువెత్తదొడంగెను. వాని పిరికితనమునకు నేను గడుపుబ్బ నవ్వుచు భయపడకుము భయపడకుమని వానిననుసరించి పోయి పట్టుకొంటిని. అందు లకు వాడు తొట్రుపడుచు నన్ను వదలిపెట్టు వదలిపెట్టుమని పెద్ద యెలుంగున నఱ చుచు మఱియు నిట్లనియె. తమ్ముడా ! నేను పుట్టినది మొదలు నేటి‌ దనుక నెందును మనుజునివలె నవ్వుచు మాటలాడు చిలుకను గనివిని యెరుగను. ఇది పిట్టగాదు. పెను