పుట:కాశీమజిలీకథలు-12.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

వత్సా ! పరమేశ్వరానుగ్రహమున నీకుఁ దగినపదవి లభించెను, ఇక్కు౦ తలరాజ్యరమాపరిష్వంగ విశేషమున నీకనన్యదుర్లభంబగు సుఖం బొనఁగూడఁగలదు. నేనిందుండరాదు తరుచు వచ్చి నీక్షేమమరసి పోవుచుందును. నీకే లోపమును రానే రదు. నీజనకునివలన నభ్యసించిన ధనుర్విద్యా వైశాంద్యంబెల్లఁ దెల్లమగునట్లు సర్వ దిగ్విజయం బొనర్చుము. శుభములంబొందుము. పోయివచ్చెదనని బల్కి వాని యను మతమువడసి యద్దేవమౌని యధేచ్చగఁబోయెను.

పుండరీకుండట్లు కుంతలభూపరీవృఢుండై యధాన్యాయమున బ్రజాపరి పాలనం బొనరించుచుండెను.


గీ. వాని వక్షస్థలంబు లక్ష్మీనివాస
    యోగ్యముగఁ దనరె ముఖమహోత్పలాంత
    రమున నుచితగౌరవపీఠమమరె వాణి
    కుభయులను నొక్కచోనిల్పి యొప్పె నతఁడు.

అతండు దివ్యతేజోవిరాజితుండైనను సూర్యునివలె ననేక కరప్రయోగ సంతాపిత మండలుడు కాలేదు. శీతాంశునివలె నపరోదయమున వక్రత్వమును బొంద లేదు. సస్తార్బివలె దహనవ్యాపారమున విభూచి నుత్పాదింపలేదు. దీపికవలె బాత్రో పరి బ్రజ్వలించుటలేదు. మాణిక్యమణివలె సువర్ణబంధమున నాయకత్వము వహించి యుండలేదు.


శా. ఆ రాజేంద్రుభూజాసిముఖ్యము ప్రతాపాంతర్విహారాతి వి
    స్తారంబందున గ్రీష్మత్మీవ్ర, మరిరాడ్డారాశ్రుధారాసమా
    సారంబొప్పఁ బ్రవర్షణంబు, తుహినచ్చాయావిరాజద్యశ
    స్సారాప్తిన్‌ శిశిరంబు, నిట్లొకటఁ దేఁజాలున్‌ ద్రికాలంబునన్‌.

మరియు నతండు సుశిక్షిత సేనాసమగ్రుడై విశేషవిజగీషుడై భుజబలమున సర్వకాలముననే నఖిలద్విజయంబొనర్చి విజయనిశితాసిచే విపక్షక్ష్కాపాలవంశనిర్మూ లనం బొనరించిమించెను. అప్పుండరీక పార్థివుండు ధర్మమున గలికాల ప్రాబల్యము నిరసించుచు, సుగుణముల నఖిల సాథులోకమును రంజింపజేయుచు వినయమున గురు జనుల సన్మానించుచు, క్రమాగతానుజీవిసామంతచక్రమును ప్రసాదమున నభివం దించుచు, బృకృతికనలము ననుర క్తి నాదరించుచు, చతురంభోధివలయాలంకారమై యనన్యభోగమై యేకాంతపత్రశేఖరమైయెసగు వసుంధరరమాసామ్రాజ్యసింహాస నమున సుప్రతిష్ఠుడైయుండెను. ఆతనికి విభూతివర్దనుండను విప్రకులసంజాతుండు మంత్రియై సకలరాజకార్యముల గ్రమమున నిర్వ ర్తించును. రాజున కత్యంతాప్తుడై మెలంగుచుండెను. ఇట్లు పుండరీకుండు కుంతలరాజ్య పరిపాలనం బొనర్చుచు నత్యంత