పుట:కాశీమజిలీకథలు-12.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

సేయగలుగుట. ప్రజావిరక్తిచే రాజునకుఁ గోశదుర్గబలాది సప్తాంగంబులు క్షీణించును. దాన ద్రివర్గము నశించును. అందుచే నుభయలోకమార్గమును ఖిలీభవింపగలదు. ఇందువలన మన యాశయము నెరవేర గలదు.


ఉ. చండకరాన్వయాంబునిధిచంద్రుఁడు భూరమణుండతండు ఱా
     గుండియవాఁడు వేలుపులకోటు లసంఖ్యలు భూతధాత్రిపై
    నుండఁగ నీక కాశిపురి నొక్కఁడు రాజ్యము సేయుచుండఁగా
    దండితనంబు లేకిటుల దైన్యముబూనఁగ మీకుఁబోలునే ?

అని పెద్దగా నుపన్యసించిన యాచార్యుని పలుకు లాదరించి యప్పుడే శచీ కళత్రుండు వైశ్వానరప్రభృతుల బృహస్పతి వచినానుసారముగ బ్రవర్తించుటకు నియమించెను.

త్రివిష్టపేశ్వరు ననుమతమున నగ్ని దేవుండు భూలోకమున దనమూర్తి నుపసంహరించెను. వాయువు స్తంభించెను. వరణుడు వర్షింపకుండెను. అందగ్ని లేకుండుటచే స్త్రీలు పాకక్రియయం దసమర్థల్తెరి. బ్రాహ్మణుల నిత్యాగ్నులు సెడి పోయెను. ఆ సమయమున భూపతి సమ్ముఖమున కాంధసికసంఘ మేతెంచి ముకు ళిత కరపుటులై కొంకుచునిట్లని విన్నవించిరి. దేవా ! నే డదేమికారణముననో కాని యెంత బ్రయత్నించిన నిప్పురంబున‌ నిప్పు బుట్టవయ్యెను. దానంజేసి దేవరకీదినమున సూర్యపాకము నాయితంబైన యోదనము బెట్టవలసివచ్చినది. ఇప్పటికే రెండవజూము దాటుచున్నది. కావున నారగింప వేంచేయుమని మనవి జేసికొనిరి. వారిమాటల కారాజ మార్తాండుఁడు నివ్వెరంబడుచు దేవత లొనరించిన కపటమ నెరింగి యానాటి కర్క కిరణతాపపక్వములగు పదార్థముల భుజించి వచ్చి గొల్వుదీర్చి వాసవాదులు చేసిన యప కారమునకు బ్రతీకారము జింతించుచున్న సమయమున బౌరు లగ్నితిరోధానమునకు భయంపడి యమ్మహోత్పాతంబు రాజున కెరింగింప నేతెంచిన వారి నెల్లర నాదరించి దివోదాసుండు నాకనివాసులు జేసిన దుర్వృత్తికి దలంప బనిలేదని వారి కుదుటుగఱ పుచు మరియు నిట్లనియె.


మ. అనుమానింపక యాసుధాంథసులు మాయా కల్పనావంచనం
     బునవైశ్వానరునిన్‌ హరించిరి యవుంబో ! యింత మాత్రంబులో
     నన వాయోగమహానుభావమునకున్‌ భంగంబు వాటిల్లునే !
     ననక ల్దాఁచిన బెండ్లి యాగునొకొ ! దుశ్చారిత్రముల్గంటిరే !

 సీ. దహనస్వరూపంబుఁ దాల్చి యేఁ గైకొందు
             దావ్యకవ్యాహుతు లధ్వరములఁ