పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

235

చతుర్థాశ్వాసము.


యిదాక నెఱుఁగ కే నేమి: యంటినో మిమ్ము
ననుచుఁ గన్నీళ్ళు రా కడఁచుకొనుచు
నడపుల మాటల నగవుల మీయందుఁ
దొంటి కైవడి కొంత దోఁచుచున్న

గీ. వసుధ మానిసిఁ బోలుమానుసులు లేరె
యనుచు నుండుదు భాగ్య మఖునికిఁ జేసి
యిప్పుడీయన్న చే ఫలియించెసదియు
సజ్జనులగోష్టి యిహపర సాధనంబు. 171

క. అని మణికంధరుఁ గనుఁగొని
వినుచ్పుడుదు మునుపు నిన్ను వేమజు నిచ్చో
టస దూరశ్రవణ బలం
బున నీయన నీదుగాసమున్ విని పొగడన్ .172

శా. గంధర్వుండవు జాతి యెచఁగ శుభాకార :బు చంద్రత్రపా
సంధానకమ మద్వితీయుఁడ విఁకన్ సంగీత సాహిత్య భౌ
రంధర్యం బరయం దపస్వి వసురప్రద్వేషి భక్తుండవున్
బంధం బొక్కటి గల్లె శాప మనఁగా నాయన్న నీకుం దుదన్

గీ. అనినఁ దచ్చాపగతి కాత్మయందు వగపు
దనరఁ గలభాషిణి మణికంధరుని జూచి
మును కళాపూర్ణుకథ నీవు విన వెధనదు
పట్టిచే నంత య బ్లెల తిట్టువడితి.174