పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

         సత్యరాజా పూర్వదేశయాత్రలు

              గీ. క్రొత్తగాడిదఁబోఁగొట్టుకొన్నవాఁడు
                   వాలఖిల్యప్రసాదంబు పచ్చియరఁటి
                   పండ్లు దక్షిణయిచ్చి సాపడియె నేని,
                   దొరకు గాద౯భంబది యింటిత్రోవలోనె.

              గీ. గోవృషంబులఁ బొఁగొట్టుకొన్నవాఁడు
                    వచ్చి కదళీఫలంబుల వాలఖల్య
                   సన్నధినిబుచ్చుకొన్నఁబక్షంబుగోన
                   దొరకు గొవది బందెలదొడ్డిలొన.

              గీ. తనదుగాదఁ బో గొట్టు కొనినవాడు
                    వచ్చి రాహుకాలంబున భ క్తితోడ
                    వాలఖిల్య ప్రసాదంబుఁబడసెనేని,
                    కంటఁబడ డెప్పుడును వానిగాద౯భంబు.

మూలనూత్రములు దేవభాషయందే యున్నను స్రీశూద్రులు వానిని పరింప రాదని సర్వజనొపయోగాధ౯ముగా వానినిట్లు తెనిఁగించినాను. ఈయభినవ మహశాస్త్రమునకు ప్రసొదజ్యోతిశ్శాస్త్రమన్న పేరెట్లు సర్దక మగునొ మిరేయూహించి తెలిసకోవచ్చును. వాలఖిల్య ప్రసాదమువలనఁ గలుగు ఫలములను దెలుపుశాస్త్రమగుటచేత ప్రసాదశాస్త్రమును, ఆయాఫలములకు జ్యోతిశ్శాస్త్ర సంబందమును గల్పించుటచేతఁ గొంతవఱకు జ్యోతశ్శాస్త్రమునూయి యీపేరీయపూర్వశాస్త్రమున కంవ్వధ౯మయినది. ప్రసాదమును స్వీకరించుకాలమును బట్టివారదోషములు, తిధిదొషములు, నక్షత్రదోషములు, రాహుకాలదోషములు, మొదలయిన కాలదోషములన్నియు నియపూర్వశాస్త్రము నందు జొప్పింపఁబడియున్నవి, మొట్ట మొదటవచ్చి నచాకలివాఁడుతనగాడిద తప్పిపొయి నందునకయి ప్రశ్నయడుగుటకు శుక్రవారమునాఁడు పదిగడియల ప్రొద్దెక్కివచ్చి ప్రసాదస్వీకారము చేసినందున, నాఁడు