పుట:ఈశానసంహిత.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శివుఁడు వారికిఁ బ్రత్యక్షమయ్యెను. వారు వృస్తముగను సమస్తముగను శివుని స్తుతించిరి. శివుఁడు ప్రసన్నుఁడై మీ రస్త్రములు ప్రయోగించుటచే దాని తేజంబున మీతేజంబులు దగ్ధములైనవి. కావున మీరలు మీమీపదముల కనర్హులరు. మీరు శివరాత్రివ్రత మొనరించితిరేని మీమీపదములు మరల మీ కొసంగెదను అని చెప్పి వారిప్రార్థనముపైని శివరాత్రికాలనిర్ణయము వ్రతవిధానమును వారి కాననిచ్చెను. అని వర్ణింపఁబడినది.

మాహాత్మ్యమునం దీచెప్పఁబడినకథకే ఉరులింగోద్భవమను సంజ్ఞ నిర్దేశింపఁబడినది. సంహితయందు "శివరాత్రి ప్రాదుర్భావతద్వ్రతవిధానములు" అని నిర్దేశింపఁబడినది.

మాహాత్మ్యమునందు తొలుతనే మునులప్రశ్నమున శివరాత్రివ్రతంబు చెప్పఁబడియుండు దాని నెవ్వ రాచరించి, రేఫలంబు నొసంగు, మాకుఁ దేటపడ న్వివరింపు మనుటయు, ఫలమును కుదాహరణముగా సుకుమారచరిత్రము చెప్పఁబడినది. సంహితయందు వ్రతవిధానశ్రవణావంతరము మునులు ఆవ్రత మేఫల మొసంగునని ప్రశ్నింప ఫలము వర్ణించి యుదాహరణముగా సుకుమారచరితము చెప్పఁబడినది.

సంహితయందు 61 అనుష్టుప్ శ్లోకములలో వర్ణింపఁబడిన సుకుమారచరిత్రము మాహాత్మ్యమున మూఁడశ్వాసములలో మూడువందలపది గద్యపద్యములలో వర్ణింపఁబడినది.

సంహితయందు సుకుమారుని జన్మభూమి — వింధ్యోత్తరదిగ్భాగమున ఇరావతీశతద్రూవిపాట్సింధువితస్తానదులు ప్రవహించు రమణీయమైన దేశము గలదు. అందు సింధునదీతీరమున కుబ్జకాభిధాననగరంబు గలదు. అందు గొప్పరాజు గలఁడు. అతఁడు వ్యవహారార్థము నయకోవిదుండగు బ్రాహ్మణుని స్థాపించెను. అతనికి సుకుమారుఁడని పిరు. అని రాజామాత్యతచ్భార్య లనామకులుగా వర్ణింపఁబడిరి. మాహాత్మ్యమున వింధ్యపర్యంతభూవిపినంబునడుమ రత్నపురమను రాజధాని కలదు.