పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“యః ప్రజాః సుఖే సుఖినోస్తరా రామాః, తదర్థ స్వార్థేషు పరేషు నియంతారః”
అంటే పాలకుడు అనే వాడు తన ప్రజల ఆనందాన్ని మరియు శ్రేయస్సును తన సొంత
ఆనందం మరియు శ్రేయస్సుగా భావించేవాడు.


8. విభజన అనంతరం ఏర్పడిన ప్రతికూల పరిస్థితులలో కూడా అత్యంత ప్రగతిశీల రాష్ట్రాలలో మన రాష్ట్రం తన స్థానాన్ని తిరిగి సాధించడానికి ఎంత కష్టమైనా సరే, ఏ సవాలునైనా అధిగమిస్తూ అవకాశాలను అందిపుచ్చుకోగలదని మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృఢ విశ్వాసం.

వినూత్న పరిపాలనా ఆవిష్కరణలు:

9. రాష్ట్ర విభజన తరువాత, జటిలమైన విభజన సమస్యలతో మరియు నష్టాలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ, ఉన్నత ఆశయాలతో మరియు నూతన శక్తితో రాష్ట్రాన్ని పునర్ నిర్మించు కోవడానికి మా ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది.

10. మన రాష్ట్ర సమస్యలను అధిగమించాలంటే పాత మరియు మూస పద్ధతులలో కాకుండా, ఒక సరికొత్త విధానంతో మాత్రమే అభివృద్ధిని సాధించగలమని గౌరవ ముఖ్యమంత్రిగారు తాను చేసిన సుదీర్ఘ పాదయాత్ర అనుభవంతో తెలుసుకొన్నారు.

11. దీనికి అనుగుణంగా, అనేక మార్గ నిర్దేశక కార్యక్రమాలతో మా ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా, ప్రజల జీవితాలలో వెలుగు నింపుతోంది. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు, మ్యానిఫెస్టోలోని ఇతర పథకాలు మరియు అమలు చేస్తున్న వివిధ వినూత్న కార్యక్రమాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాలు మెరుగైన ఫలితాలను అందించటం వలన, ప్రపంచ వ్యాప్త మేధావులచే కూడా ప్రశంసలు అందుకుంటున్నాయి. కొత్త ఆలోచనలను, ఆవిష్కరణలను మరియు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధానాలను కనీ వినీ ఎరుగని రీతిలో అమలు పరచడం వలన తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం సంతృప్త స్థాయిలో ప్రజలందరి జీవితాలలో గణనీయమైన మార్పు తీసుకురాగలిగింది.

3